Mr. Bachchan : ‘మిస్టర్ బచ్చన్‌ ‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగంటే?

Mr. Bachchan : టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. అయితే ఈ మూవీ ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే రొమాంటిక్ సాంగ్ సినిమాపై ఓ రేంజ్లో బజ్ క్రియేట్ చేసింది.. ఇవాళ ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతో పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్లో చూపించిన ఎలివేషన్స్, డైరెక్టర్ హరీశ్ శంకర్ మార్క్ సినిమాలో కనిపించలేదు అంటున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయింది.. కానీ సెకండాఫ్లో కథను నడిపించడంలో రైటర్ తడబడ్డారని, మొత్తానికి మాస్ మహారాజా రేంజ్లో ఈ లేదంటున్నారు. కానీ ఓ వర్గం ఆడియన్స్ని మాత్రం ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి మిస్టర్ బచ్చన్ ఆడియన్స్ని నుంచి మిక్స్డ్ రివ్యూస్ని అందుకుంటుంది. మరి చివరి షో వరకు ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

'Mr Bachchan' OTT platform fix.. Why streaming?
‘Mr Bachchan’ OTT platform fix.. Why streaming?

ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై జనాల్లో ఆసక్తి నెలకొంది. మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోతోనే ఓటీటీ పార్ట్నర్ ఏదో రివీల్ అయిపోతుంది. ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట. ఈ మూవీని రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మూవీ ఫలితాన్ని, ఆడియన్స్లో ఆ చిత్రానికి ఉన్న బజ్ని బట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్, ఓటీటీ సంస్థల ఒప్పందం ప్రకారం సినిమాను డిజిటల్ ప్రీమియర్స్ తీసుకువస్తున్నారు. ఈ మూవీని ఓటీటీలోకి సెప్టెంబర్ ఫస్ట్ వారంలో లేదా సెకండ్ వీక్ లో తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు