Ashika Rangnath: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసిన నాగార్జున బ్యూటీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Ashika Rangnath: 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగా మూవీ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ఆషికా రంగనాథ్. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా డేరింగ్ అండ్ డాషింగ్ ‌ రోల్ ప్లే చేసింది ఈ చిన్నది. గ్లామర్, యాక్టింగ్ కలబోసిన ‌ రోల్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు క్యూ కట్టాయి.

ఇక ఇటీవలే ఈమె చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బ్యూటీ నా సామి రంగ తో పాటు ఈ ఏడాది కన్నడం లో ఓ2 అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఓ2 మూవీ ఓటిటి లోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ భాషలో మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేశారు.

Nagarjuna's beauty movie that has come to digital streaming
Nagarjuna’s beauty movie that has come to digital streaming

ఇక త్వరలోనే తెలుగు తో పాటు మలయాళం, తమిళ్ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీని దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ ‌ రాజ్ కుమార్ నిర్మించింది. రాఘవ్ నాయక్, ప్రశాంత్ రాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మెడికల్ ‌ థ్రిల్లర్ గా ప్రయోగాత్మక కథాంశం తో రూపొందిన ఈ మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా ఆషికా రంగనాథ్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ సినిమాగా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు