Nagendran Honeymoons : ఐదుగురు భార్యలతో హీరో హనీమూన్… ఓటిటీలో ఎప్పుడు చూడొచ్చంటే?

Nagendran Honeymoons : హనీమూన్ అనేది పెళ్ళయిన కొత్త జంటలకు లైఫ్ లాంగ్ గుర్తుండే మధురమైన జ్ఞాపకం. ఇద్దరూ ఎక్కడికైనా ఇష్టమైన ప్లేస్ కి వెళ్ళి ఆ మెమొరీస్ ను ఎన్నటికీ చెరిగిపోకుండా గుండెల్లో భద్రపరుచుకుంటారు. అయితే ఈ కాలంలో ఒక్క పెళ్ళాంతో వేగడమే కష్టం కదా.. కానీ ఈ హీరో మాత్రం 5 గురు పెళ్లాలతో హనీ మూన్ అంటున్నాడు. ఈ హిలేరియస్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నాగేంద్రన్ హనీమూన్స్ ఓటీటీ డేట్ ఫిక్స్

ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడు జీవితం వంటి మలయాళ సినిమాలు దక్షిణ భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాలన్నీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే నాగేంద్ర హనీమూన్. ఇటీవల కాలంలో మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు విభిన్నమైన కంటెంట్ స్టోరీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నాయి.

Nagendran's Honeymoons Full Episode, Watch Nagendran's Honeymoons TV Show  Online on Hotstar

- Advertisement -

నాగేంద్రన్ హనీమూన్ జాతీయ అవార్డు గ్రహీత సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్. వన్ లైఫ్ ఫైవ్ వైవ్స్ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జూలై 19 నుండి డిజిటల్‌గా ప్రసారం కానుంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం తదితర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో గ్రేస్ ఆంటోని, కని కుశ్రుతి, శ్వేతా మీనన్, అల్పి పంజికరణ్, నిరంజన్ అనుప్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు రెంజి ఫణిక్కర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉందన్నమాట.

ఓటీటీకి ఫేవరెట్ డైరెక్టర్…

నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరిస్ కు నితిన్ రెంజీ ఫనిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫేవరెట్ డైరెక్టర్ అని ఎందుకన్నామంటే ఇప్పటిదాకా ఆయన తెరకెక్కించిన మూడు సిరీస్ లు కూడా డిస్నీ లోనే రిలీజ్ అవ్వడం విశేషం. గతంలో ఈ దర్శకుడు మలయాళంలో రూపొందించిన కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిలోర్ ప్రీమియర్ లీగ్ అనే వెబ్ సిరీస్ లు డిస్నీ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ముచ్చటగా మూడు సిరీస్ లు డిస్నిలో స్ట్రీమింగ్ కాగా, ఇప్పుడు నాలుగో సిరీస్ కూడా డిస్నీలోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సిరీస్ ఓటిటీలోకి ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ మూవీ లవర్స్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు