DoubleIsmart : ఓటిటి లో డబుల్ ఇస్మార్ట్ కి దారుణమైన రెస్పాన్స్.. డైరెక్టర్ పరువు మొత్తం తీస్తున్నారు..

DoubleIsmart : డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా మూడు వారాల కింద రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఆగష్టు 15న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్స్ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, డిజాస్టర్ వసూళ్లతో బయ్యర్లకు భారీ నష్టాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా హిందీలో అయితే డబుల్ ఇస్మార్ట్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి చెత్త సినిమాలు టాలీవుడ్ లో వస్తున్నాయి అంటూ ట్రోల్ చేసారు. రామ్ పోతినేని (Ram pothineni) కూడా ఈసారి తన రొటీన్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడని కామెంట్స్ వచ్చాయి. థియేటర్ల వద్ద 40 కోట్ల భారీ నష్టాలు అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటిటి లో రిలీజ్ అయింది. అయితే ఇక్కడ కూడా డబుల్ ఇస్మార్ట్ కి విమర్శల బాధ తప్పలేదు.

Negative response to DoubleIsmart movie in OTT

ఓటిటి లో దారుణమైన ట్రోల్స్..

ఇక థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయిన డబుల్ ఇస్మార్ట్ (DoubleISmart) మూవీ తాజాగా రెండు రోజుల కింద అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో డిజిటల్ రిలీజ్ అయింది. అయితే ఓటిటి లో థియేటర్లకి మించిన ట్రోలింగ్ ఈ సినిమాకి వస్తుంది. మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించలేని ఎన్నో చెత్త సీన్స్ తో నిండిపోయిన ఈ సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్, & డైలాగ్లు తప్పితే అసలు చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏమి లేవంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా థియేటర్లో డిజాస్టర్ అవడం గురించి తెలిసి సినిమా చూడని ఆడియన్స్ పూరి పై సింపతీ చూపించినా, ఓటిటి లో ప్రేక్షకులు డబుల్ ఇస్మార్ట్ చూసిన తర్వాత డిజాస్టర్ అవడమే మంచిదని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

డైరెక్టర్ పరువు తీస్తున్న నెటిజన్లు..

ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి జగన్నాథ్ (Puri jagannath) ఇలాంటి చెత్త సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదని చెప్పాలి. ఎలాగైనా హిట్ కొట్టాలని, పూరి జగన్నాథ్ మరీ ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అలీ (Ali) వంటి స్టార్ కమెడియన్ తో కూడా వ్యంగంగా అలాంటి సీన్లు ఎలా తీయాలనిపించింది.. అంటూ నెట్టింట ఆడేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఫేడౌట్ అయ్యాడని, చెత్త సినిమాలు తీయడంలో తన గురువు ఆర్జీవీ ని ఫాలో అవుతున్నాడని, ఇక పూరి జగన్నాథ్ సినిమాలు తీసేస్తే మంచిదని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు