Netflix: బ్లాక్ బస్టర్ సిరీస్ కు ఒకే సీజన్ తో ఫుల్ స్టాప్ పెడుతున్న నెట్ ఫ్లిక్స్

Netflix :దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న వెబ్ సిరీస్ కు సీజన్ వన్ తోటే ఫుల్ స్టాప్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సిరీస్ రెండవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? ఇలాంటి నిర్ణయం తీసుకుని నెట్ ఫ్లిక్స్ ఎందుకు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ సంచలన నిర్ణయం

నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన హారర్ వెబ్ సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్. ఏప్రిల్ 25న అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ కు ముందుగా ఆశించిన ఆదరణ దక్కలేదు. కానీ రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత ఊహించని విధంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ, అందులో ఇద్దరు యువకులు చేసే సాహసాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ సీజన్ 2 ను క్యాన్సిల్ చేసిందని వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సిరీస్ రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఒక కారణం ఉందనే ప్రచారం జరుగుతుంది.

Dead Boy Detectives (TV Series 2024) - IMDb

- Advertisement -

అసలు కారణం ఏంటంటే?

దశాబ్దాల కాలం గ్యాప్ తో చనిపోయిన ఇద్దరు యువకులు ఆత్మలుగా మారతారు. చనిపోయిన తర్వాత ఒకరికి ఒకరు స్నేహితులవుతారు. అయితే నిజానికి చావు బ్రతుకులు అని చక్రానికి చాలా రూల్స్, పద్ధతులు ఉంటాయి. మంచి చేసిన వారు స్వర్గానికి, చెడు చేసినవ్ వారు నరకానికి వెళ్తారు. అయితే ఈ ఇద్దరు మాత్రం అలా వెళ్లకుండా చావు నుంచి తప్పించుకొని సీక్రెట్ గా ఆత్మలుగా మారి తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఆత్మలుగా మారిన వారి కోసం డిటెక్టివ్స్ గా మారతారు. ఈ నేపథ్యంలోనే బ్రతికి ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలు వీళ్లకు తోడవుతారు. ఒక వైపు చావు లెక్కలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరిని వెతుకుతూ తరుముతుంటే, ఈ నలుగురు కలిసి చాలామందికి హెల్ప్ చేస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ అబ్బాయి పై మరో అబ్బాయి ప్రేమను పెంచుకుంటాడు. ఈ ప్రాణ స్నేహితుల్లో ఒక అబ్బాయిని చావుకు సంబంధించిన రాక్షసి నరకానికి లాక్కెళ్ళిపోతుంది. అతన్ని కాపాడడానికి మరో అబ్బాయి సాహసం చేస్తాడు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ ను క్యాన్సిల్ చేయడానికి ముఖ్య కారణం ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ ఉన్నట్టుగా చూపించడమేనని అంటున్నారు. దీంతో కొంత మంది నెటిజన్లు నెట్ ఫ్లిక్స్ పై మండి[పడుతున్నారు. కాగా ఇది ఒక హాలీవుడ్ సిరీస్. విదేశాల్లో చాలా వరకు ఇలాంటివి చట్టపరంగా నడుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ సెకండ్ సీజన్ ను క్యాన్సిల్ చేసింది అనడంలో అర్థం లేదు అంటున్నారు హాలీవుడ్ మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు