IC814 : కాంట్రవర్సీకి తెరలేపిన బాలీవుడ్ వెబ్ సిరీస్.. బ్యాన్ చేయాలని డిమాండ్..

IC814 : బాలీవుడ్ లో కాంట్రవర్సీ లు కేరాఫ్ గా రెగ్యులర్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతుంటాయన్న సంగతి తెలిసిందే. సింపుల్ గా చెప్పాలంటే నెలలో ఒక్క సినిమా అయినా ఏదో ఒక కాంట్రవర్సీ కి గురవుతూ ఉంటుంది. అందుకే లాక్ డౌన్ కాలంలో ఎలాంటి సినిమాలు వచ్చినా బాలీవుడ్ హిందీ ఆడియన్స్ సినిమాలు రిజెక్ట్ చేసారు. మొత్తం బాలీవుడ్ (Bollywood) నే బాయ్ కాట్ చేసే పరిస్థితి వచ్చింది మొన్నటివరకు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ నుండి బాలీవుడ్ కోలుకోవడానికి మూడేళ్లు టైం పట్టింది. అయినా సరే బాలీవుడ్ లో పలు సినిమాలు వివాదాలకు కారణం అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కంగనా రనౌత్ ఎమెర్జెన్సీ సినిమా కూడా బ్యాన్ చేయాలనీ ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా, తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలని నార్త్ జనాలు డిమాండ్ చేస్తున్నారు.

Netizens demand to ban 'IC814 The Kandahar Hijack' web series

 

- Advertisement -

వెబ్ సిరీస్ పై కాంట్రవర్సీ..

బాలీవుడ్ లో తాజాగా “IC 814 ది కాంద‌హార్ హైజాక్” (IC814 The Kandahar Hijack) అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. అనుభ‌వ్ సిన్హా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, సిరీస్ మొత్తం ర‌క్తి క‌ట్టించే కథాంశం, గ్రిప్పింగ్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సిరీస్ లో నజిరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ(Vijay Varma), అరవింద్ స్వామి లాంటి స్టార్ క్యాస్ట్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఆగష్టు 29న నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయి మంచి వ్యూయర్ షిప్ ని రాబడుతుంది. ఇక 1999 లో కాందహార్ హైజాక్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా “IC 814 ది కాంద‌హార్ హైజాక్” సీరిస్ తెరకెక్కగా ప్రస్తుతం సోషల్ మిడియాలో వివాదానికి తెరలేపింది ఈ సిరీస్.

బ్యాన్ చేసి తీరాల్సిందే..

అయితే 1999 లో “కాందహార్ హైజాక్” (Kandahar Hijack) సంఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కగా, ఈ సిరీస్ లో పలు వివాదాస్పద అంశాలని వక్రీకరించి చూపించారని, నెట్టింట ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. భారత ఆర్మీ కి సంబంధించి సీక్రెట్ గా ఉంచాల్సిన కొన్ని అంశాలను, ముఖ్యంగా అజిత్ దోవ‌ల్ ఆధ్వ‌ర్యంలోని NSA చ‌ర్య‌ల వెన‌క కొన్ని రాజ‌కీయ కార‌ణాల‌ను ఈ సిరీస్ లో బహిర్గతం చేసారని ఆరోపణలు వచ్చాయి. అన్నిటికి మించి, “IC814” సిరీస్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని, వెబ్ సిరీస్ ని వక్రీకరించారని సమాచారం. 1999 లో హైజాక్ లో ఉగ్రవాదులైన హైజాకర్ల పేర్లు ఈ సిరీస్ లో మార్చేసారు. వారి అసలు పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్త్రీ అని ఉండగా, ఈ సిరీస్ లో శంకర్, భోలా అనే పేర్ల‌ను వాడి వక్రీకరించారని, హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. కథలో పాత్రల్ని వక్రీకరించి కొందర్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, “IC814” సిరీస్ ని వెంటనే బ్యాన్ చేయాలనీ, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ను ట్యాగ్ చేస్తూ నెట్టింట ప్రేక్షకులు వైరల్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సిరీస్ ని ప్రదర్శిస్తున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు