New OTT Releases : ఈ వారం ఓటిటి జాతర… 24 సినిమాల్లో ఆ ఒక్కటే స్పెషల్

New OTT Releases : కొత్త నెల కొత్త వారం వచ్చేసింది. అలాగే దాంతో పాటే ఓటిటిలోకి కొత్త సినిమాలను కూడా తీసుకురాబోతోంది. అయితే ఈవారం ఏకంగా 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అయితే వీటిలో రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ జానర్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. మరి జూన్ 1 నుంచి జూన్ 5 దాకా ఈ వారం ఓటిటిలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి.

ఈ ఒక్కటే స్పెషల్

ప్రస్తుతం థియేటర్లలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ మూవీ ఈవారం కూడా ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ శుక్రవారం కూడా థియేటర్లోకి సినిమాలు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే. అయితే ఈ వారం ఏకంగా 24 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, అందులో ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు సినిమాలు లేకపోవడం తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచే అంశం. ఇక ఈవారం మొత్తం స్ట్రీమింగ్ కాబోతున్న ఈ 24 సినిమాలలో ఒకే ఒక్కటి మాత్రమే తెలుగు మూవీ లవర్స్ కు స్పెషల్. అదే వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3. ప్రేక్షకులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో జూలై 5 నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి రాబోతోంది.

డిస్ని ప్లస్ హాట్‌స్టార్

రెడ్ స్వాన్ -కొరియన్ వెబ్ సిరీస్- జూలై 3
ల్యాండ్ ఆఫ్ తనబతా -జపనీస్ వెబ్ సిరీస్- జూలై 4

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్

స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూలై 1
అల్విన్ సీజన్ 5 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్– జూలై 1
స్ప్రింట్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై 2
బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ -ఇంగ్లీష్ చిత్రం- జూలై 2
ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూలై 3
బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై 4
రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 – ఫ్రెంచ్ వెబ్ సిరీస్ – జూలై 4
డెస్పరేట్ లైస్ – పోర్చుగీస్ వెబ్ సిరీస్- జూలై 5
గోయో – స్పానిష్ చిత్రం- జూలై 5

Mirzapur Trailer Review Pankaj Tripathi Ali Fazal Rasika Dugal Vijay Varma  Amazon Prime Video Web Series Mirzapur 3 Mirzapur 3 Trailer: मिर्जापुर-3 का  ट्रेलर हुआ रिलीज, विजय वर्मा की एंट्री ने मचाया

అమెజాన్ ప్రైమ్

బాబ్ మార్లీ: వన్ లవ్ – ఇంగ్లీష్ చిత్రం- జూలై 3
గరుడన్ -తమిళ మూవీ – జూలై 3
స్పేస్ క్యాడెట్ – ఇంగ్లీష్ సినిమా – జూలై 4
మీర్జాపూర్ సీజన్ 3 – తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్- జూలై 5

జియో సినిమా

ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ – హిందీ వెబ్ సిరీస్- జూలై 3
హీ వెంట్ దట్ వే – ఇంగ్లీష్ సినిమా – జూలై 5

బుక్ మై షో

ఇఫ్ -ఇంగ్లీష్ మూవీ- జూలై 3
ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా – ఇంగ్లీష్ చిత్రం- జూలై 4
ది సీడింగ్ – ఇంగ్లీష్ సినిమా- జూలై 5
విజన్స్ – ఫ్రెంచ్ మూవీ – జూలై 5
హరా-తమిళ సినిమా- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 5

సోనీ లివ్

మలయాళీ ఫ్రమ్ ఇండియా-మలయాళ సినిమా- జూలై 5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు