OG OTT Rights : భారీ ధరకు అమ్ముడైన ఓజీ ఓటిటి రైట్స్… ఎన్ని కోట్లంటే?

OG OTT Rights : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెగా ఫ్యాన్స్ కు అన్నీ గుడ్ న్యూస్ లే అందుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి ఓటిటి డీల్ భారీ ధరకు కుదిరినట్టుగా తెలుస్తోంది. మరి ఎన్ని కోట్లకు, ఏ ఓటిటి ప్లాట్ఫామ్ ఓజి రైట్స్ ను దక్కించుకుంది? అనే వివరాల్లోకి వెళితే….

దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ చేతిలో ఓజి రైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా ఓజి. ఇందులో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది. దీనికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

దె కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంతవరకు పెండింగ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం ఓజి డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టుగా సమాచారం. దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓజి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోగా, దీనికోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా 92 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న పవన్ అభిమానుల్లో ఈ వార్త మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. కాగా ఓజి మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

- Advertisement -

Pawan Kalyan OG Release date announced officially | Pawan Kalyan OG Release  Date: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో  ఓజీ కొత్త పోస్టర్

పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుపొందడంతో త్వరలోనే రాజకీయాల్లో బిజీ కాబోతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటిదాకా ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేశాక నెక్స్ట్ రాజకీయాలకే పరిమితం అయిపోవాలని పవన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే జూన్ మూడో వారం నుంచి హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ లోపే ఓజి మూవీ షూటింగ్ ను, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇన్నాళ్లు తనకోసం ఓపికగా వేచి చూసిన దర్శక నిర్మాతలకి బల్క్ డేట్స్ కేటాయించి, 2025 సమ్మర్ లోపే తాను ఒప్పుకున్న సినిమాలన్నింటిని పూర్తి చేయబోతున్నారు పవన్ కళ్యాణ్.

ఓజీ వాయిదా వార్తలు

అయితే గత కొంతకాలంగా ఓజీ మూవీ రిలీజ్ వాయిదా పడబోతోందని, 2025 లోనే మూవీ రిలీజ్ ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ వార్తలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. మరోవైపు పవన్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి ఓజి మూవీ షూటింగ్ పూర్తి చేస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మేకర్స్ స్పందిస్తే గానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు