Oke Oka Jeevitham : డేట్ ఫిక్స్

చాలా రోజుల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న యువ కథనాయకుడు శర్వానంద్, ఇప్పుడు ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. “ఒకే ఒక జీవితం” చిత్రంతో శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, రీతు వర్మ హీరోయిన్ గా నటించి మెప్పించారు. అలాగే శర్వానంద్ కి తల్లిగా అక్కినేని అమల నటించింది.

‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ సుజిత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్ లు ఈ చిత్రానికి పనిచేశారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న “ఒకే ఒక జీవితం” అటు వసూళ్ల పరంగా కూడా బ్రేక్ ఈవెన్ చేరుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సినిమాతో పోటీపడిన శర్వానంద్ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

మరి థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. థియేటర్ లో విడుదలైన సరిగ్గా 6 వారాలకు చిత్రం ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు