Omen OTT: ధైర్యం ఉంటేనే చూడండి.. ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Omen OTT.. ఈ మధ్యకాలంలో చాలామంది హార్రర్ , థ్రిల్లర్ చిత్రాలను చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో విడుదలవుతూ మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులను భయంతో పరిగెత్తించే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఎప్పుడూ దెయ్యాల చిత్రాలను ఇష్టపడే వారి కోసం ఇప్పుడు మరో సినిమాను తీసుకోవచ్చారు మేకర్స్.. అదే ది ఫస్ట్ ఒమెన్.. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మొత్తం ఐదు సినిమాలు రాగా.. ఇప్పుడు ప్రేక్షకులను మరింత భయపెట్టడానికి ఈ సినిమా సిద్ధం అయ్యింది.

ఒమెన్ ఫ్రాంచైజీ..

Omen OTT: Watch if you dare.. Where is the streaming from 30th of this month..?
Omen OTT: Watch if you dare.. Where is the streaming from 30th of this month..?

ది ఒమెన్ (1976 ), డా మెయిన్ – ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ ఫ్లిక్ట్ (1981), ఒమెన్ 4 ద అవేక్నింగ్ (1991), ది ఒమెన్ (2006) చిత్రాలు మంచి రివ్యూస్ కూడా ప్రేక్షకుల నుంచి అందుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు ది ఒమెన్ (2006) ఫ్రీక్వల్ గా ది ఫస్ట్ ఒమెన్ (2024) సినిమాను తీసుకొచ్చారు మేకర్స్.. 1971లో జరిగిన కథను ఈ సినిమా చూపిస్తుంది.. అంటే 1976 హార్రర్ క్లాసిక్ ది ఒమెన్ మూవీకి ముందు ఐదు సంవత్సరాల ముందు కథతో ఈ సినిమా వస్తోంది.. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.. మే 30వ తేదీ నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.. ఈ సినిమాను హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది.

ఒంటరిగా చూడకండి..

ప్రముఖ డైరెక్టర్ ఆర్కేశ స్టీవెన్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇన్ సెన్, తాఫఈక్ బర్హోమ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు ఇక మంచి హారర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వవద్దు.. అయితే ముందుగా మీకు ధైర్యం ఉంటేనే ఈ సినిమా చూడండి లేకపోతే ఫ్యామిలీతో కలిసి చూడండి ఒంటరిగా మాత్రం అసలు చూడకండి .. అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుందనటంలో కూడా సందేహం లేదు.. అంత భయానకంగా ఉండే ఈ సినిమాను మాత్రం ఒంటరిగా అస్సలు చూడకండి.. మొత్తానికైతే హర్రర్ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.. మరి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు