OTT Movie : అమ్మాయిలను మాత్రమే చంపే సైకో… బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సైకో కిల్లర్ మూవీ

OTT Movie : ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు ఓటీటీ లో ప్రేక్షక ఆదరణ ఎక్కువగానే వుంది. త్వరలో ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ మూవీ. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు అదికూడా తెలుగు ఓటీటీ లోకి రాబోతున్నాయి. అంటే క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. ఈ రోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటి ఇంటరెస్టింగ్ మూవీనే. మరి ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకుందాం పదండి.

ఈ మూవీ పేరు ఆపరేషన్ రావణ్.

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు అవుతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరో వారం రోజుల్లో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది రెగ్యులర్ సైకలాజికల్ ఫార్మాట్ లో వుండటమే ఈ మూవీ కి అతి పెద్ద మైనస్ పాయింట్ అయింది. పైగా వెంకట సత్య అనే డైరెక్టర్ ఈ మూవీ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే మేకర్స్ దీనిపై ఒక అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరితో పాటు రాధికా శ‌ర‌త్‌ కుమార్, రఘు కుంచె వంటి నటి నటులు ప్రధాన పాత్రలు పోషించినప్పటికి ఫస్ట్ మూవీ కావటంతో ప్రేక్షకులను ఎంగేజే చేయడం లో డైరెక్టర్ తడబడ్డారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినప్పటికి, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక అతి త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఒకవేళ ఈ సైకో కిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Operation Raavan' Movie Review - IndustryHit.Com

- Advertisement -

కథ విషయానికొస్తే..

ఓ సీరియల్ కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ, హత్యలకు పాల్పడుతూ వుంటాడు. వరుస హత్యలు చేస్తున్న ఈ సీరియల్ కిల్లర్ కేసును ఆమని అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రామ్ అనే అసిస్టెంట్ తో కలసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ నేపథ్యం లోనే సైకో కోసం మొదలు పెట్టిన ఈ ఇన్వెస్టిగేటివ్ ప్రయాణం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. కానీ ఇద్దరు ఆ విషయాన్ని మనసులోనే దాచుకొని కేసుపై ఫోకస్ చేస్తారు.  ఒకానొక టైమ్ లో ఆమని రామ్ పై వున్న ప్రేమను బయట పెట్టాలని డిసైడ్ అవుతుంది. అంతలోనే సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? రామ్ ఆ కిల్లర్ నుంచి తాను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని రామ్ కాపాడుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ. అయితే అంతదాకా ఓటీటీలో ఉన్న ఇంతర సినిమాలు చూస్తూ ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు