Ori Devuda : అప్పుడే ఓటీటీకి

విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించిన సినిమా ఓరి దేవుడా. తమిళం సూపర్ హిట్ మూవీ ఓ మై క‌డ‌వులే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రానికి అశ్వథ్ మారి ముత్తు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాతో మిథిలా పాల్క‌ర్‌, ఆశాభ‌ట్ హీరోయిన్లుగా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మ‌య్యారు. అక్టోబ‌ర్ 21న విడుద‌లైన  ఈ ఫాంట‌సీ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇప్ప‌టికే కొన్ని చోట్ల థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మవుతున్న ఓరి దేవుడా సినిమా అప్పుడే డిజిట‌ల్ స్ట్రీమింగ్ కి త‌యారైంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో న‌వంబ‌ర్ 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇవాళ అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి ఆహా యాజ‌మాన్యం అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

నువ్వునాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ చెప్పిన డైలాగ్ మాదిరిగానే.. “దేవుడా..  ఓ మంచి దేవుడా తిన‌డానికి పాల‌కూల ప‌ప్పు, ఆలు ఫ్రై ఇచ్చావు. నాలాగే ఈ ప్ర‌పంచంలో ఉన్న వాళ్లంద‌రి కోసం చూడడానికి ఆహాలో ఓరిదేవుడా సినిమాని ఇచ్చావు” అంటూ ‘ఓరి దేవుడా’ ఓటీటీ రిలీజ్ పోస్ట‌ర్ ను సోష‌ల్ మీడియాలో సేర్ చేసింది ఆహా. ప్ర‌స్తుతం ఈ పోస్టర్ తెగ వైర‌ల్ అవుతోంది. ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు ఓరి దేవుడా సినిమాని థియేటర్‌లో చూడ‌న‌ట్ట‌యితే ఆహాలో చూసేయండి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు