OTT Bold Movie : చీకటి పడగానే భర్తను వదిలేసి భార్య పాడు పనులు… ఈ బో*ల్డ్ మూవీని సింగిల్ గా చూడండి

OTT Bold Movie : ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో కోరికలను అదుపు చేసుకోలేక, క్షణికావేశంలో భార్యాభర్తలు తమ బంధాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇండియాలోనే కాదు ఏ దేశంలోనైనా సరే పెళ్లికి ప్రత్యేకంగా వ్యాల్యూ ఇస్తారు. ఆ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ పవిత్రమైన బంధాన్ని పలు కారణాలతో కించపరుస్తూ ఉంటారు కొంతమంది. పెళ్లి చేసుకున్న పార్టనర్ ను పక్కన పారేసి ఇతరులతో ఎఫైర్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అచ్చం అలాంటిదే. తనను ఎంతగానో ప్రేమించే భర్త ఉన్నప్పటికీ చేతులారా మరో వ్యక్తి కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటుంది భార్య. పేరుకు బో*ల్డ్ మూవీనే అయినప్పటికీ తప్పు చేసే ఎంతోమందికి ఈ మూవీ కనువిప్పు కలిగిస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఈ బోల్డ్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటిలో ఇప్పటికే ఇలాంటి సినిమాలు ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ అందులో రొమాంటిక్, ఎమోషనల్, మెసేజ్ ఓరియంటెడ్ అంశాలను కలగలిపే లవ్ స్టోరీలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఆలోచించకుండా చేసే చిన్న తప్పు వల్ల ఎంతటి దారుణాలు జరుగుతాయో తెలియ చెప్పే ఈ సినిమా పేరు అడిక్టెడ్. మరి ఆ భార్య చేతులారా తన కాపురాన్ని ఎలా నాశనం చేసుకుంది అనే విషయాన్ని స్టోరీ ద్వారా తెలుసుకుందాం.

Addicted - Movie - Where To Watch

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమాలో ముందుగా ఓ హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తారు. అందమైన భార్యాభర్తల జంట, ఈ జంటకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉంటారు. మొత్తానికి సంతోషంగా ఉండే ఈ కుటుంబంలో ఓ పెయింటర్ చిచ్చు పెడతాడు. అతను పెయింటింగ్స్ కోసం ఆమె అనుమతిని అడిగితే, హీరోయిన్ పర్మిషన్ ఇవ్వడమే ఆమె తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది. అంతటితో ఆగకుండా తన బొమ్మను గీసేందుకు కూడా అంగీకరిస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది.

అదే చనువుతో ఆ పెయింటర్ హీరోయిన్ తో శారీరక బంధాన్ని మొదలు పెడతాడు. ఒక్కసారి కాదు తరచుగా ఇద్దరు కలిసి ఈ తప్పును రిపీట్ చేస్తారు. ఇక అతనికి అడిక్ట్ అయిన భార్య చీకటి అవ్వగానే భర్తకు తెలియకుండా ప్రియుడిని కలవడానికి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయాలన్నింటినీ భర్త గమనిస్తాడు. మరోవైపు తప్పు చేస్తున్నాను అని ఫీల్ అయ్యే హీరోయిన్ తన మనసు మార్చుకోవడానికి థెరపిస్ట్ దగ్గరకు కూడా వెళ్తుంది. కానీ చీకటి అవగానే మళ్లీ అదే పరిస్థితి. ఆ అలవాటును అస్సలు మార్చుకోలేక పోతుంది. మొత్తానికి ఓరోజు అసలు విషయం బయటపడుతుంది. మరి ఆ భర్త తన భార్యను ఏం చేశాడు? ఆమె జీవితం ఈ ఎఫైర్ గురించి బయటపడిన తర్వాత ఎలాంటి మలుపు తిరిగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే అడిక్టెడ్ అనే ఈ మూవీనీ చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు