OTT Bold Movie : అమ్మాయి కాదిది అరాచకం… ఇదెక్కడి బో*ల్డ్ మూవీరా మావా

OTT Bold Movie : ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓటిటిలో కూడా పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వస్తుండడంతో నెటిజన్లు తమకు నచ్చిన సినిమాలను చూడడానికి బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఓటిటిలో అందుబాటులో ఉన్న సినిమాలలో థ్రిల్లర్, హారర్ జానర్ సినిమాలతో పాటు రొమాంటిక్ సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నో రొమాంటిక్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా, తాజాగా ఓ మూవీ మాత్రం ఓటిటిని షేక్ చేస్తోంది. అమ్మాయి కాదు ఇది అరాచకం అనిపించేలా చేస్తున్న ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

సాధారణంగా ప్రేమ అనగానే ఇండియన్స్ అయితే అమ్మాయి, అబ్బాయి క్యూట్ జోడి గుర్తొస్తుంది. కానీ విదేశాల్లో అలా కాదు. అక్కడ ఇద్దరు అబ్బాయిల మధ్య లేదా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టడం కూడా సర్వసాధారణం. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తెలుగులో కూడా వచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అప్సర రాణిని హీరోయిన్ గా పెట్టి చేసిన సినిమాను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ మూవీ కాదనుకోండి. కానీ ఈ సినిమాను చూశాక ఇది ఎక్కడి బో*ల్డ్ సినిమారా మామ అనక మానరు. అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు డక్ బటర్. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు కావాల్సినన్ని ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడడమే బెటర్ ఆప్షన్.

Duck Butter 🎬👩‍❤️‍👩 história não convence mesmo tendo potencial - YouTube

- Advertisement -

స్టోరీలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ నైట్ క్లబ్ లో సింగర్ గా వర్క్ చేస్తుంది. మరో అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్ లో పని చేస్తూ ఉంటుంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు కలుసుకుంటారు. మొదటి చూపులోనే ఇద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. ఆ తర్వాత మాటలు కలిసి, ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ పుడుతుంది. ఇంకేముంది లేట్ చేయకుండా ఇద్దరమ్మాయిలు లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. కొత్త కదా కొత్త సంసారం లాగే ఇద్దరమ్మాయిల మధ్య ఒకరిని విడిచి ఒకరం ఒక్క క్షణం కూడా ఉండలేం అన్నంత ప్రేమ పెరిగిపోతుంది. అలాగే రొమాంటిక్ లైఫ్ లో కూడా సంతోషంగా ఉంటారు. కానీ ఓ రోజు సడన్ గా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. రాను రాను మనస్పర్ధలు పెరిగి ఓ రోజు సింగర్ తన పార్ట్నర్ ని కొట్టడంతో పాటు దూరం పెట్టేస్తుంది. ముట్టుకుంటే యుద్ధమే అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. మరి ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి? చివరికి ఈ జంట మళ్లీ ఒక్కటయిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే. బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీని చూడాలి అనుకునేవారు డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు