OTT Bold Movie : పెద్దలకు మాత్రమే ఈ చిన్న పిల్లల మూవీ… బో*ల్డ్ మూవీ లవర్స్ మస్ట్ వాచ్

OTT Bold Movie : ఫస్ట్ లవ్ అనే మాటను మనం తరచుగా వింటాం. అలాగే చాలామంది లైఫ్ లో ఇలాంటి మధుర జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఈరోజు కూడా మనం అలాంటి ఫస్ట్ లవ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీని మన మూవీ సజెషన్ లో తెలుసుకోబోతున్నాం. అయితే టైటిల్ లో చెప్పినట్టుగానే ఈ చిన్న పిల్లల మూవీ కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే. కాబట్టి సింగిల్ గా ఉన్నప్పుడే చూస్తే బెటర్. మరి ఈ బోల్డ్ కంటెంట్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అసలు స్టోరీ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ పేరు మెలినా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అయితే ఈ సినిమాను చూడాలంటే మాత్రం డబ్బులు పెట్టి తీరాల్సిందే. రూ. 99 రెంట్ కట్టి రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూడాలి. అయితే సినిమా చూశాక అనవసరంగా రెంట్ పెట్టాను దీనికోసం అని మాత్రం అనిపించదు. ఇక పెద్దవాళ్లు మాత్రమే చూడాల్సిన చిన్నపిల్లల మూవీ అని ఎందుకన్నామంటే ఇది ఒక చిన్న కుర్రాడి ప్రేమ కథ. అప్పుడప్పుడే టీనేజ్ లోకి అడుగు పెడుతున్న ఆ అబ్బాయి ఫస్ట్ లవ్ చుట్టే సినిమా అంతా తిరుగుతుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని తరచుగా మనం వినే మాట డైరెక్టర్ ను మాత్రం ఓ పిల్లాడిని ఒంటరి మహిళకి లింక్ చేసేలా ఆలోచింపజేసింది.

Malena-038

- Advertisement -

కథలోకి వెళ్తే…

యుద్ధం జరుగుతున్న రోజుల నాటి కథ ఇది. ఓ ఊర్లో అందరూ ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడ బ్రతుకుతూ ఉంటారు. హీరోయిన్ అదే టైంలో ఉద్యోగం కోసం ఆ ఊరికి వస్తుంది. ఒంటరిగా జీవితాన్ని గడిపే ఆ అమ్మాయి మోడ్రన్ గా చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడంతో అందరూ ఆమెని చూస్తూ ఉంటారు. ఒక కుర్రాళ్ళ గ్యాంగ్ కూడా ప్రతిరోజూ  ఆమె వచ్చే సమయానికి ఒక గోడ మీద కూర్చుని చూస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఒక బుడ్డోడు కూడా ఉంటాడు. వాడు అందరిలాగా ఆ గోడకే పరిమితం అయిపోకుండా ఆమె ఇంటిదాకా వెళ్తాడు. అంతేకాదు ఆ గోడకు ఉన్న కన్నంలో నుంచి ఆమె ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. ప్రతిరోజూ ఆమె గురించే ఆలోచించే బుడ్డోడికి ఓ రోజు టైం వస్తుంది. ఆరోజు ఒక్కడే గోడ మీద కూర్చోవడం చూసి హీరోయిన్ వాడిని ఇంట్లోకి పిలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. కానీ టీనేజ్ లో ఉన్న పిల్లోడు కదా ఆమెను ఇంకో విధంగా అర్థం చేసుకుంటాడు. మరి ఇంతకీ వీళ్లిద్దరి మధ్య స్నేహం ఎక్కడికి దారి తీసింది? అంత పెద్ద అమ్మాయి మీద ఈ బుడ్డోడికి ప్రేమ ఎలా పుట్టింది? చివరికి వీరిద్దరి స్నేహం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు