OTT Comedy Movie : ఓటీటీలో దొంగ బాబా మోసాలు… చూశారంటే కనువిప్పు కాదు కడుపు చెక్కలవ్వాల్సిందే

OTT Comedy Movie : గత రెండు మూడేళ్ల నుంచి ఓటిటిలో రొమాంటిక్, బోల్డ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు విశేషంగా ఆదరణ పెరిగింది. ఓటిటిలో అసలు కామెడీ సినిమాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఎవరికీ గుర్తు ఉండట్లేదు. దీంతో కామెడీ సినిమాలను ఇష్టపడే ఓటిటి ఆడియన్స్ కు నిరాశ తప్పట్లేదు. ఒకవేళ ఏదో ఒక కామెడీ మూవీని చూద్దాం అనుకున్నప్పటికీ వాటిని వెతకడం కష్టమవుతుంది. అలాంటి కామెడీ మూవీ లవర్స్ కోసమే ఈ ఓటిటి మూవీ సజెషన్. దేవుడి పేరుతో మోసం చేసే ఓ దొంగ బాబా కథని చూస్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. మరి ఈ కామెడీ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? ఆ మూవీ పేరేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు వడక్కుపట్టి రామస్వామి. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సంతానం హీరోగా నటించగా, ఆయన సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా కనిపించింది. థియేటర్లలో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో మాత్రం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. కార్తీక్ యోగి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని తెరకెక్కించింది. పీపుల్ మీడియా వారు నిర్మించిన ఫస్ట్ తమిళ మూవీ ఇదే కావడం విశేషం. అయితే సాధారణంగా దొంగ బాబా సినిమాలు అంటే కమర్షియల్ లేదా సోషల్ మెసేజ్ తో సీరియస్ గా నడుస్తాయి. కానీ ఈ మూవీని చూస్తే మాత్రం టైటిల్ లో చెప్పినట్టుగానే హాయిగా నవ్వుకుంటారు.

Vadakkupatti Ramasamy (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

1960 నుంచి 70ల కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది ఈ మూవీ. ఓ ఊర్లో ఉన్న చిన్న గుడి దగ్గర దేవుడు పేరుతో రామస్వామి అనే వ్యక్తి మోసాలు చేస్తూ ఉంటాడు. గుడి దగ్గరికి వచ్చే జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించే ఈ రామస్వామి అరాచకాలు తెలిసి కొంతమంది శత్రువులు ఆ గుడిని క్లోజ్ చేయిస్తారు. మరోవైపు రామస్వామి డాక్టర్ తో ప్రేమలో పడతాడు. గుడి దగ్గర ఇలా చిన్నచిన్న చీటింగ్స్ చేసుకునే రామస్వామిని డాక్టర్ అయిన హీరోయిన్ ఇష్టపడుతుందా? ఆ గుడిని రామస్వామి మళ్లీ ఓపెన్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? రామస్వామి చేసే మోసాలు బయటపడ్డాక హీరోయిన్ రియాక్షన్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. రొటీన్ స్టోరీ అయినప్పటికీ సంతానం కామెడీ హైలెట్ అని చెప్పాలి. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా కాసేపు నవ్వుకోవాలి అని ఆలోచించేవారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు