OTT Horror Movie : అందమైన ఐలాండ్ లో బ్లడీ ఇష్క్… హీరోయిన్ తో చెమటలు పుట్టించే దెయ్యం ఆటలు

OTT Horror Movie : ప్రస్తుతం ఓటీటీలో హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ మరే సినిమాలకు లేదనే చెప్పాలి. ఈ జానర్ లో కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అయితే ఇటీవల కాలంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో కంటే డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ నే ఎంచుకుంటున్నాయి. అందులో అవికా గోర్ హీరోయిన్ గా నటించిన హారర్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఎప్పుడు, ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు అనే విషయంలోకి వెళ్తే…

హాట్ స్టార్ లో అందుబాటులో..

వర్ధన్ పూరి, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ బ్లడీ ఇష్క్. 1920, రాజ్ వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ విక్రమ్ బ్లడీ ఇష్క్ మూవీకి దర్శకత్వం వహించారు. ఓటిటిలో హారర్ సినిమాలకు ఉన్న ఫుల్ క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీకి సుచరిత దాస్, మహేష్ భట్ స్టోరీని అందించగా, విక్రమ్ భట్ తెరకెక్కించారు. హరే కృష్ణ మీడియా టెక్, హౌస్ ఫుల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని మహేష్ భట్ సమర్పించారు. సమీర్ ఖాన్ ప్రతి వాలియా సంగీతం అందించారు. ఈ బ్లడీ ఇష్క్ మూవీ జూలై 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ జూలై 26 నుంచి హాట్స్టార్ లో హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు.

Love, Suspense and Horror! Disney+ Hotstar unveils the spine chilling trailer of its upcoming film, Bloody Ishq - Filmibeat

- Advertisement -

కథ ఏంటంటే…

నది మధ్యలో ఉండే అద్భుతమైన ఐలాండ్ పై అందమైన పెద్ద భవనం ఉంటుంది. అందులో స్టే చేయడానికి హీరో హీరోయిన్ కలిసి వెళ్తారు. ఐలాండ్ లో ఉండే ఇల్లు, పైగా అక్కడ ఒక్కరు కూడా ఉండరు. కానీ అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి హీరోయిన్ కి తమతో పాటు ఇంకెవరో ఉన్నారని డౌట్ వచ్చే సంఘటనలు జరుగుతాయి. పలు వింత సంఘటనలు జరిగాక హీరోయిన్ ఈ ఇంట్లో రాజ్ ఉన్నట్టు అనిపిస్తోంది అంటూ హీరోకి చెప్తుంది. కానీ హీరో మాత్రం ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ నచ్చజెప్తాడు. కానీ రాను రాను జరిగే సంఘటనల వల్ల ఆమెకు దెయ్యం ఉందనే భయం మరింతగా పెరుగుతుంది. మొత్తానికి ఆ ఇంట్లో దయ్యం ఉందనే విషయాన్ని కనిపెడుతుంది హీరోయిన్. అయితే తన మాటను ఎవ్వరూ నమ్మకపోవడంతో ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఎవరో అని తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. మరి హీరోయిన్ అనుకున్నట్టుగా ఆత్మ ఎవరిదో కనిపెడుతుందా? రాజ్ ఎవరు? దెయ్యాన్ని కనిపెట్టడానికి ఆమె ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని జూలై 26న హాట్ స్టార్ లో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు