OTT Horror Movie : దెయ్యాలతో తల్లి కూతుర్ల సావాసం… ఒంటరిగా చూసారంటే మిమ్మల్ని వెంటాడడం ఖాయం

OTT Horror Movie : హర్రర్ మూవీస్ అనేది మూవీ లవర్స్ కు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఎంత భయంకరంగా సినిమా ఉన్నప్పటికీ, లేదా ఎంత వైలెన్స్ ఉన్నా అవసరమైతే కళ్ళు మూసుకొని చూస్తాం కానీ చూడడం మాత్రం మానేయలేము. అయితే ఇప్పుడు చెప్పుకునే మూవీ మాత్రం హర్రర్ మూవీలకు బాబు లాంటి మూవీ. కాబట్టి సింగిల్ గా చూసే సాహసం చేయకండి. ముఖ్యంగా హార్ట్ పేషంట్స్ ఈ సినిమాకు దూరంగా ఉంటే మంచిది. మరి ఇంతటి భయంకరమైన ఈ హర్రర్ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

సాధారణంగా దయ్యం సినిమాలు అంటే ఒకటి రెండు లేదా కొంతవరకు మాత్రమే దయ్యం సీన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చి వణికించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఈ మూవీ మాత్రం అలా కాదు. సినిమా మొత్తం దయ్యాలే కనిపిస్తాయి. కథ, కథనం, టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాను చూశాక తడిసిపోవడం ఖాయం. పొరపాటున సింగిల్ గా చూశారో అవి మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి డోంట్ డేర్. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు కార్ప్స్ వాషర్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. హారర్ మూవీ లవర్స్ మాత్రం ఈ మూవీని చూసి తీరాల్సిందే.

The Corpse Washer (2024) - IMDb

- Advertisement -

కథలోకి వెళ్తే…

తల్లి కూతుర్లు ఇద్దరూ శవాలతో సావాసం చేస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వాళ్ళ శరీరాలను శుభ్రపరిచే పని వీళ్లది. కానీ అప్పుడప్పుడు కొన్ని శవాలు శుభ్రం చేస్తున్నప్పుడు సడన్ గా కళ్ళు తెరిచి చూడడం, లేచి కూర్చోవడం, ఒక్కోసారి వీళ్ళపై దాడి చేయడం వంటివి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ తల్లి కూతుర్లు ఆ పనిని విడిచి పెట్టరు. ఎప్పుడైనా శవాలు ఇలా బిహేవ్ చేస్తే వాటిని కంట్రోల్ చేసి తమ పనిని చేసుకుంటారు. అయితే ఒకానొక సమయంలో తల్లి ఒకటే ఈ పని చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఓ శరీరం సడన్ గా లేచి ఆమెపై దాడి చేస్తుంది.

ఎంత ప్రయత్నించినా ఆ శవం దాడిని ఆపలేక పోతుంది ఆ తల్లి. తర్వాత ఈ దాడిలో ఆమె చనిపోతుంది. దీంతో అప్పటి నుంచి కూతురు ఒక్కతే ఈ పనిని చేయాల్సి వస్తుంది. కానీ సడన్ గా కొన్ని దయ్యాలు ఎప్పుడూ ఈమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతాయి. పైగా ఆ దయ్యాలు కొంత మందిని చంపేస్తాయి కూడా. అసలు ఈ తల్లి కూతుర్లు ఇంతటి భయంకరమైన పనిని ఎందుకు చేయాలనుకున్నారు ? ఆ దయ్యాలు కూతురుని ఎందుకు వెంటాడుతున్నాయి ? అసలు ఆమెను తప్ప మిగతా వాళ్లను ఎందుకు చంపుతున్నాయి ? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కార్డ్స్ వాషర్ అనే ఈ భయంకరమైన హారర్ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు