OTT Horror Movie : ప్రపంచాన్నే వణికించిన రియల్ స్టోరీ బేస్డ్ హారర్ మూవీ… భయంతో చెమటలే

OTT Horror Movie : హారర్ సినిమాలు అంటే ఆల్మోస్ట్ రూమర్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతాయి. అతి తక్కువ సినిమాలు మాత్రమే రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తీస్తారు. ఈరోజు మన మూవీ సజెషన్ లో నిజంగా జరిగిన దయ్యాల కథను ఆధారంగా తీసుకుని తీసిన సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులంతా థియేటర్లలో ఉన్నంతసేపు హడలిపోయారు. మరి ఇంతటి భయంకరమైన మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? ఆ మూవీ పేరేంటి అనే విషయంలోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

అసలు దయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే ఉన్నాయని నమ్మే వాళ్ళతో పాటు అసలు దయ్యాలే లేవు అని వాదించే వాళ్లు కూడా ఇలా వణికించే హర్రర్ సినిమాలు అంటే బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దయ్యం మూవీ స్పెయిన్ లో జరిగిన ఒక రియల్ స్టోరీ అని టాక్. దాని ఆధారంగానే రూపొందిన ఈ హర్రర్ మూవీ పేరు వెరోనిక. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

There's A Movie On Netflix That's Supposedly So Scary Some People Can't Finish It, So I Watched And Here's How It Went

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఓపెన్ చేస్తే ఓ అమ్మాయి ఎమర్జెన్సీ పోలీస్ సర్వీస్ కి కాల్ చేసి భయపడుతూ మాట్లాడుతుంది. ఇంట్లో ఏదో వింత ఆకారం ఉందని, చంపడానికి ప్రయత్నిస్తోందని చెప్పి, తనను కాపాడాలంటూ ప్రాధేయపడుతుంది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ సంఘటనను చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. వెరోనికా అనే తండ్రి లేని అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. తండ్రి చనిపోగా, తల్లి బేకరీలో పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. వెరోనికాకు ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉంటారు. ఆమె దగ్గరుండి వాళ్లను స్కూల్ కి తీసుకెళ్తుంది. స్కూల్లో పాఠంలో భాగంగా టీచర్ గ్రహణం గురించి చెప్తూ మతానుసారంగా కొంతమంది క్షుద్ర పూజలు చేస్తూ మనుషుల్ని బలిస్తారని వివరిస్తుంది. ఇక అదే రోజు సూర్యగ్రహణం కావడంతో టీచర్ పిల్లలందరినీ తీసుకుని దాన్ని చూపించడానికి టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. అయితే వెరోనికా మాత్రం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆత్మలతో మాట్లాడడానికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది. వెరోనికా ఏవో మంత్రాలు చదవగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గ్రహణం మొదలయ్యే సమయానికి తన తండ్రి ఆత్మ బయటకు వస్తుంది. ఆ సౌండ్స్ విని వెరోనికా కళ్ళు తిరిగి పడిపోగా, మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత నుంచి వెరోనికాకు తండ్రి ఆత్మ వింత వింత అనుభవాలు ఎదురయ్యేలా చేస్తూ నరకం చూపిస్తుంది. అసలు వెరోనికా తండ్రి ఆత్మను ఎలా పిలవ గలిగింది ? సొంత తండ్రి ఆత్మే ఎందుకు కూతురిని చిత్రహింసలు పెడుతోంది ? ఆమె ఆ ఆత్మ నుంచి బయట పడగలిగిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు