OTT Horror Movie : వెన్నులో వణుకు పుట్టించే రియల్ హారర్ స్టోరీ… వరదలు అంటే భయపడేవాళ్ళు డోంట్ డేర్

OTT Horror Movie : వర్షాకాలం వచ్చిందంటే వరదలు అనేవి సర్వసాధారణం. కానీ ఆ వరదలు కూడా కొన్నిసార్లు భయానక పరిస్థితులను తలపిస్తాయి. ఇప్పటిదాకా హారర్ సినిమాలు అనగానే ఏదో ఒక ఇంట్లో దయ్యాలు ఉండడం, లేదా ఎవరో ఒకరిని పట్టి పీడించడం, ఈ రెండు కాదంటే అడవిలో ఉండే దయ్యాల గురించి ఎన్నో సినిమాలను చూసాం మనం. కానీ ఇదో కొత్త హారర్ మూవీ. వరదల్లో చిక్కుకున్న ఓ జంటకు అంతకంటే భయంకరమైన హారర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదేంటి? ఈ మూవీ ఏ ఓటిటిలఓ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

డిఫరెంట్ హారర్ సినిమాలను ట్రై చేయాలి అనుకునే వారికి ఇదొక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇండోనేషియన్ హారర్ మూవీ. ఇండోనేషియాలోని ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పేరు కుయాంగ్. అంటే ఆ భాషలో దెయ్యం అని అర్థం. భాష ఏదైనా సరే హారర్ సినిమా అయితే చాలు అనుకునే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కనిపించే పాత్రలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజిగా అర్థం అవుతుంది. ఇక మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు ఊహించలేరు.

Watch Kuyang | Netflix

- Advertisement -

కథలోకి వెళ్తే…

భిమూ, శ్రీ అనే భార్యాభర్తలు ఉంటారు. అయితే హీరోకి కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని ఊర్లో టీచర్ గా జాబ్ వస్తుంది. ఇంకేముంది మంచి సాలరీ కావడంతో ఆర్థిక కష్టాలు తీరిపోతాయనే ఆశతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్తారు. అయితే గ్రామంలోకి వీళ్ళను తీసుకెళ్లడానికి డ్రైవర్, ట్రావెల్ ఏజెంట్ వస్తారు. కారు ప్రయాణం మధ్యలో కిటికీలో నుంచి ఒక ఎగురుతున్న తల కనిపించడంతో హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత చెట్టుకు వేలాడుతూ ఉన్న ఒక శవపేటిక వీళ్లను వెంటాడుతుంది. అక్కడ నుంచి కూడా ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోతారు. ఒక్క పడవ ద్వారానే వెళ్లడానికి దారి ఉన్న ఆ ఊర్లోకి బయట మనుషులుగా హీరో హీరోయిన్ రావడంతో అందరూ వింతగా గమనిస్తారు. అలాగే తంబి అనే ఆవిడని ఆ ఊరి ప్రజలంతా కుయంగ్ అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒకానొక సమయంలో స్కూల్ మొత్తం వరదల వల్ల మునిగిపోయి చాలామంది స్టూడెంట్స్ చనిపోతారు. దీంతో అక్కడ దయ్యం ఉందని ప్రచారం జరుగుతుంది. స్కూల్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టడంతో ఓ మంత్రగత్తెను తీసుకొస్తారు. హీరోయిన్ ని చూసిన ఆవిడ ఆమె కడుపుతో ఉందని, శక్తి కోసం కుయాంగ్ తన బిడ్డను బలి తీసుకుంటుందని చెప్పడంతో హీరో దాన్ని చంపి తన ఫ్యామిలీని కాపాడుకోవాలని బయలుదేరుతాడు. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఆ ఊరు నుంచి ప్రాణాలతో బయటపడగలిగారా? అనేది తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు