OTT Movie : ఓటిటిలో చెర్రీ హీరోయిన్ బో*ల్డ్ మూవీ… ఏందిరా సామి ఈ అరాచకం

OTT Movie : మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమా గురించి మెగా ఫాన్స్ కు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే మొదటి సినిమానే అయినప్పటికీ ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఉంటాయి. ఇక ఇదే మూవీతో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీనే అయినప్పటికీ ఈ అమ్మడు చిరుతతో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన కుర్రాడు మూవీ డిజాస్టర్ కావడంతో అవకాశాలు కరువయ్యాయి. ఆ మూవీ బొక్క బోర్లా పడడంతో నేహకు అవకాశాలు ఇవ్వలేదు టాలీవుడ్. దీంతో బాలీవుడ్ చెక్కేసిన నేహా శర్మ అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ బో*ల్డ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంలోకి వెళ్తే…

సోనీ లివ్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు 36 డేస్. ఇందులో నేహా శర్మ అందాల ఆరబోత, మెస్మరైజ్ చేసే గ్లామర్ లుక్స్ చూస్తే ఫిదా కావాల్సిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూలై 12 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, అమృత ఖాన్ విల్కర్, షరీఫ్ హష్మీ, పురం కోహ్లీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ విశాల్ ప్యూరియా హాలీవుడ్ బోల్డ్ వెబ్ సిరీస్ 36 డేస్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉండగా ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల నిడివితో సాగుతుంది.. ఈ సిరీస్ ను కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీతో పాటు ఇతర భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Watch 36 Days a Crime thriller web series Online - Sony LIV

- Advertisement -

కథలోకి వెళ్తే..

ఈ కథ గోవాలోని వాస్కోడగామాలో జరుగుతుంది. బీచ్ ఒడ్డున ఉన్న 5 విల్లాల్లో నాలుగు కుటుంబాలు నివసిస్తాయి. ఓ విల్లా ఖాళీగా ఉంటుంది. మైక్రోబయాలజిస్టులు డాక్టర్ హృషికేష్ జయకర్ (పురబ్ కోహ్లి), రాధిక జయకర్ (శృతి సేథ్), రిచ్ ఫ్యామిలీకి చెందిన లలిత (అమృతా ఖాన్విల్కర్)-వినోద్ (షరీబ్ హష్మీ), క్రిస్టియన్ కుటుంబం డెంజిల్ మచాడో (కెన్నీ దేశాయ్)-వినైఫర్ మచాడో (షర్నాజ్ పటేల్), టోనీ వాలియా (చందన్ రాయ్ సన్యాల్)-సియా (చాహత్ విగ్) తమ కుటుంబాలతో అక్కడ నివసిస్తుండగా, ఓ అందమైన ఎయిర్ హోస్టెస్ ఫరా జైదీ (నేహా శర్మ) ఐదవ విల్లాలో ఉండటానికి వస్తుంది. ఫరా అక్కడికి రాగానే అందరి దృష్టి ఆమెపై పడుతుంది. అక్కడి మగాళ్లు అందరూ ఆమె మాయలో పడిపోతారు. అయితే అప్పటికే ఆ కుటుంబాలన్నింటికీ పలు చిక్కులు, రహస్యాలు ఉంటాయి. ఒకరోజు ఉదయం ఫరా హత్యకు గురై దారుణమైన స్థితిలో కన్పిస్తుంది. ఆ హత్య వెనుక కారణం ఏమిటి? ఆమెను ఎవరు చంపారు ? ఫరా ఎందుకు ఒంటరిగా జీవిస్తుంది? ఆమె ఏ ఉద్దేశ్యంతో అక్కడ నివసించడానికి వచ్చింది? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమాలో బోల్డ్ సన్నివేశాలతో పాటే రక్తపాతం కూడా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు