OTT Movie: ప్రేమ పిచ్చి ముదిరి తన మాంసాన్నే వండి ప్రియురాలికి తినిపిస్తాడు

OTT Movie: ప్రేమ పిచ్చి ముదిరితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ప్రేమలో పిచ్చివాడైన ఓ అబ్బాయి ప్రియురాలికి ఏకంగా తన మాంసాన్నే వండి తినిపిస్తాడు. వింటుంటేనే నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అని అనిపిస్తోంది కదా. మరి ఈ మూవీ ఏ ఓటీడటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఇంట్రెస్టింగ్ మూవీ పేరు ఆమీస్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ పార్వశ్యంలో మునిగి తేలే లవర్స్ కి ఇదొక డిస్టర్బింగ్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే క్రైమ్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అసలు ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం.

Aamis movie review: Anurag Kashyap presents a maniacal feast for hungry  masses; an irresistibly insane romance - Hindustan Times

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే?

ప్రేమ ఎంత గొప్పదో అంతే భయంకరమైనది కూడా. ఈ సినిమా చూశాక మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఇక స్టోరీ లోకి వెళ్తే సుమన్ అనే పీహెచ్డీ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా అడవుల్లో షికార్లు చేయడం, అక్కడ దొరికే జంతువుల మాంసాన్ని వండుకుని తినడం లాంటివి ఇతని హాబీలు. అయితే ఓ రోజు అనుకోకుండా అలా అడవిలో దొరికిన మాంసం తినడం వల్ల తన ఫ్రెండ్ ఆరోగ్యం పాడవుతుంది. దీంతో ఆ ఫ్రెండ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడే సుమన్ జీవితాన్ని మలుపు తిప్పేలా ఓ డాక్టర్ తో పరిచయం అవుతుంది.

మాటల్లో ఆమె తనకు మాంసం అంటే ఇష్టం అని చెప్పడంతో ఇద్దరు బాగా కనెక్ట్ అవుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డాక్టర్ నిర్మల్ కి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉంటారు. ఆమె భర్త కూడా డాక్టర్ గా పని చేస్తారు. అయితే సుమన్ ఫ్రెండ్స్ మాత్రం ఆమెకు దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. కానీ అతి కొద్ది సమయంలోనే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ఇద్దరు కలిసి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం, జంతువుల మాంసాలను వండి తినడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఒకానొక సమయంలో ఆ డాక్టర్ పై ఇష్టం పీక్స్ కు వెళ్ళిన సుమన్ ప్రేమ పిచ్చి ముదిరి తన శరీరంలోని ఓ భాగాన్ని కట్ చేసి దానిని స్వయంగా వండి ఆమెకు తినిపించేస్తాడు. అయితే ఇదంతా తెలియని నిర్మల్ కి ఆ మాంసం బాగా నచ్చుతుంది. తెలియకుండానే ఆమె మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. మరి మనిషి మాంసం కొట్లలో దొరకదు కదా ? ఆ తర్వాత ఏం జరిగింది? సుమన్ ఏం చేశాడు అనే విషయం డాక్టర్ కి తెలిసిందా ? చివరికి వీరిద్దరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది ?అనే విషయం తెలియాలంటే ఆమె మూవీని సోనీ లివ్ లో చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు