OTT Movie : కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ డ్రామా… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : ఓటిటిలో ప్రతివారం రిలీజ్ అయ్యే సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు మూవీ లవర్స్. ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న కొరియన్ లేదా మలయాళ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి అంటే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అందుకే ప్రతివారం రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్ లో ఉండే మలయాళ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా పటిక్యులర్ గా గమనిస్తూ ఉంటారు. ఇక ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి అంటే పొరపాటున కూడా మిస్ కాకుండా చూసుకుంటారు. అలా ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాల లిస్టులో ఓ మలయాళ కామెడీ డ్రామా ఉంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీడీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులోకి రాబోతోంది? అనే విషయాలను చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మలయాళ కామెడీ డ్రామా పేరు అడియోస్ అమిగో. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటులు సూరజ్ వేరంజముడు, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించారు. కంప్లీట్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న మలయాళ భాషలో థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పై ఈ మూవీని పెద్దగా ఆదరించలేదు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో నెల కూడా తిరగకుండానే ఓటీటి స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి పాపులర్ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం మలయాళ, తెలుగు భాషల్లోనే కాకుండా తమిళ భాషలో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

Adios Amigo (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

కథలోకి వెళ్తే….

సినిమా అంతా ప్రియం, ప్రిన్స్ అనే ఇద్దరు వ్యక్తులు చుట్టూనే తిరుగుతుంది. ఆర్థిక కష్టాల్లో ఉండే వ్యక్తి ప్రియం. తన తల్లికి గుండె ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. పైగా తీరని అప్పుల్లో కూరుకు పోతాడు. కనీసం సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరు. ఈ నేపథ్యంలోనే ప్రిన్స్ తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అయితే ఇద్దరు తాగే అలవాటు ఉండడంతో త్వరగానే స్నేహితులుగా మారతారు. ప్రిన్స్ బాగా రిచ్. అందుకే తామిద్దరి మధ్య ఏర్పడిన పరిచయాన్ని వాడుకొని అతన్ని డబ్బులు అడగాలని డిసైడ్ అవుతాడు. మరి ప్రియం అతన్ని డబ్బులు అడిగాడా? ప్రిన్స్ అతను తల్లి వైద్య సహాయానికి కావాల్సిన అంత డబ్బును ఇచ్చాడా? లేదా డబ్బు వల్ల వీరిద్దరి ఏమైనా అపార్థాలు వచ్చాయా? చివరికి ప్రియం తల్లి బ్రతికిందా? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? మూవీ ఎలా ఎండ్ అయ్యింది? అనే సంగతులు తెలియాలంటే అడియోస్ అమిగో అనే సినిమాను చూడాల్సిందే. ఒకవేళ టైమ్ లేకపోతే ఈ వీకెండ్ మాత్రం మిస్ కాకుండా సినిమాల లిస్ట్ లో ఈ మూవీని చేర్చుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు