OTT Movie : ఒక్క రూపాయి తీసుకోకుండా విజయ్ సేతుపతి చేసిన మూవీ ఓటిటిలోకి… ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : మహారాజ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ ను అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వంద కోట్ల క్లబ్ కు చేరువైన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ హైప్ ను క్యాష్ చేసుకోవడానికి సేతుపతి నటించిన మరో మూవీ ఓటిటిలో రిలీజ్ కు రెడీ అయింది. విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఈ మూవీకి ఎట్టకేలకు ఏడాది తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టడానికి మోక్షం లభించింది. మరి ఆ మూవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా…

తమిళ మూవీ అజాగియ కన్నె అనే మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరో కాదు. గెస్ట్ రోల్ పోషించారు. విఆర్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శివ కుమార్, సంచిత శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీలో నటించడానికి విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. దర్శకుదిపై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా ఫ్రీగా సినిమా చేసి చూపించారట విజయ్ సేతుపతి. అయితే ఇది విజయ్ సేతుపతి మూవీనే అన్నట్టుగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్. దీంతో చిన్న సినిమాకే అయినా బజ్ బాగానే వచ్చింది. కానీ రొటీన్ స్టోరీ వల్ల కలెక్షన్లపై దెబ్బ పడింది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోయింది.

Review- Azhagiya Kanne – Malini Mannath

- Advertisement -

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఓటిటిలోకి అడుగు పెడుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ హిట్ కావడంతో ఆయన కీ రోల్ పోషించిన ఈ తమిళ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లిస్టులో ఉండడం విశేషం.

స్టోరీ ఏంటంటే…

ఈ మూవీలో హీరో పేరు ఇన్బా. డైరెక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. అయితే అంతదాకా పలు నాటకాలకు స్క్రిప్టులు రాస్తూ తనలోని రచయితకు పని చెప్తాడు. ఈ నేపథ్యంలోనే కస్తూరి అనే అమ్మాయితో హీరోకి పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమకి దారి తీస్తుంది. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దల నుంచి అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో ఈ ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కాపురంలో గొడవలు మొదలవుతాయి. మరి వీరి కాపురం ఎలా సాగింది? ఈ ప్రేమికుల మధ్య పెళ్లయ్యాక గొడవలు రావడానికి కారణం ఏంటి? ఇందులో విజయ్ సేతుపతి పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న అళగీయ కన్నె మూవీని వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు