OTT Movie : ఒక్కడికి నలుగురు తండ్రులా… ఈ హిలేరియస్ కామెడీ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఓటిటీలు అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు కొదవ లేకుండా పోయింది. రీసెంట్ గా ఒక భర్తకు ఐదుగురు భార్యలు ఉంటే ఎలా ఉంటుంది అనే ఓ మలయాళ సినిమా తెరపైకి వచ్చింది. ఇప్పుడేమో మన మూవీ సజెషన్ లో తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ఒక కొడుకుకి నలుగురు తండ్రులు ఉంటే ఏంటి పరిస్థితి? అనే స్టోరీ గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయంలోకి వెళ్తే…

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మూవీ గురించి కాదు వెబ్ సిరీస్ గురించి. ఈ ఫన్ ఫీల్డ్ కామెడీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ పేరు బాప్ కౌన్?. టైటిల్ కు తగ్గట్టుగానే హీరో తన తండ్రి ఎవరో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే సిరీస్ మొత్తం కడుపుబ్బా నవ్వుకునే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నవ్వుకోవడం అంటే ఏదో ఊరికే స్మైల్ ఇచ్చి వదిలేయడం కాదు పడి పడి నవ్వేలా ఉంటుంది స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

Baap Kaun? - Disney+ Hotstar

- Advertisement -

కథలోకి వెళ్తే…

హీరో చిన్నప్పుడు స్కూల్లో తెలియక చేసిన ఓ పొరపాటే తన జీవితంలో నిజంగా జరుగుతుంది. స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి ఫ్రెండ్ చెప్పిన ఆన్సర్ ను కాపీ కొడతాడు హీరో. కానీ అతనేమో తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తే, హీరో మాత్రం ఎక్కువ మంది తండ్రులు ఉన్నాడు అంటూ కొంచెం మార్చి చెప్తాడు. అయితే ఊహించని విధంగా తన నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. హీరో పెద్దవాడై పెళ్లికి రెడీ అవుతాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అక్కడే సమస్య మొదలవుతుంది.

అప్పటిదాకా ఒక ఎంపీ తండ్రి అనుకున్న హీరోకి అతను నిజంగా తన తండ్రి కాదని తెలుస్తుంది. ఆ తర్వాత నిజం ఏంటని అడిగితే సదరు ఎంపీ ఒక బాడీ గార్డ్ మీ తండ్రి అని చెప్తాడు. ఆ తర్వాత బాడీ గార్డును అడిగితే అది కూడా నిజం కాదని తెలుస్తుంది. అలా వెతుక్కుంటూ మరో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఇలా మొత్తంగా నలుగురు తండ్రులు తేలుతారు. అసలు ఈ హీరోకు నిజమైన తండ్రి ఎవరు ? తండ్రి సమస్య తీరి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడతాడా ? ఏడు చేపలు కథలా హీరో తండ్రి స్టోరీ ఎందుకు ఇలా ఉంది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే బాప్ కౌన్ అనే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే. అయితే వెబ్ సిరీస్ అయినప్పటికీ ఎండ్ టు ఎండ్ ప్రతి ఎపిసోడ్ కామెడీతో నిండిపోయింది. అయితే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేదు. భాష అడ్డు కాదనుకునేవారు ఈ సిరీస్ ను హిందీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు