OTT Movie : ఈ మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ కావాలనే ఆలోచనకే వణికిపోతారు… ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : సాధారణంగా అబ్బాయిలు టీనేజ్ లోకి అడుగు పెట్టీ  పెట్టక ముందు నుంచే గర్ల్ ఫ్రెండ్ గురించి కలలు కంటూ ఉంటారు. ఇక అప్పటి నుంచి మొదలుకొని ఆ తర్వాత పెళ్లయ్యే దాకా కూడా గర్ల్ ఫ్రెండ్ అనేది మన లైఫ్ లో హాట్ టాపిక్కే. అసలు గర్ల్ ఫ్రెండ్ లేదంటే అదేదో తప్పు చేసినట్టుగా చూస్తూ ఉంటారు. అంతేకాదు గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు నామోషిగా ఫీల్ అవుతారు. కానీ ఒక్కసారి ఈ సినిమా చూశారంటే అసలు గర్ల్ ఫ్రెండ్ అంటేనే పారిపోతారు. మరి అంతగా ఈ మూవీలో ఏముంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళితే….

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు బేబీ రెయిన్ డీర్. ఈ మూవీ పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో నటినటులు ఇద్దరు తమ యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టారు. పార్ట్నర్ కావాలని కలలు కనే వాళ్ళు మాత్రం ఈ మూవీకి దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే మూవీ చూశాక లైఫ్ పార్ట్నర్ ఇంత భారంగా ఘోరంగా ఉంటుందా ? అని అనిపించక మానదు. సినిమాల్లో లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు. నిజానికి ఇదొక బలవంతపు లవ్ స్టోరీకి సంబంధించిన సిరీస్. ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఒక్కోసారి అమ్మాయి వైపు, మరోసారి అబ్బాయి వైపు నుంచి ఆలోచిస్తే బుర్ర కరాబ్ అవ్వడం ఖాయం. మొత్తానికి సినిమా అయితే అబ్బాయి వైపు నుంచే ఉంటుంది.

Baby Reindeer Cast, Release Date, Photos, Trailer - Netflix Tudum

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఆల్రెడీ లవర్ ఉన్న అమాయకపు ఆణిముత్యం మరో అమ్మాయి బలవంతపు ప్రేమలో చిక్కుకుంటాడు. ప్రేమ పేరుతో ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టడాన్ని నరకంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆరు నెలల పాటు ఆమె వల్ల నరకం చూసినప్పటికీ మారుతుందిలే అని సరిపెట్టుకుంటాడు. తను మెంటల్ గా సరిగ్గా లేదు కాబట్టి త్వరలోనే సెట్ అవుతుందని ఆమెను భరిస్తాడు. కానీ ఇదంతా అర్థం చేసుకోని ఆ అమ్మాయి మాత్రం అతనిపై పెత్తనం చెలాయిస్తూ తన గొంతు వింటేనే వణికి పోయేలా చేస్తుంది. అతగాడు ఏ పని చేసినా అక్కడికి వెళ్లి ఇబ్బంది పెడుతుంది.

స్టాండప్ కమెడియన్ గా చేస్తే అక్కడికి, బార్ టెండర్ గా చేద్దాం అంటే అక్కడికి కూడా వెళ్లి ఇబ్బంది పెడుతుంది. అమ్మాయి ప్రేమలో కల్మషం లేకపోయినా ఆమె అంటే ఇష్టం లేకపోవడంతో ఈ ఇబ్బందికర ప్రేమను భరించలేక అతను పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం ప్రేమిస్తే చాలు అని వేడుకుంటుంది. మరి చివరికి వీరిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? అతను ఆ అమ్మాయిని ఎలా వదిలించుకున్నాడు? లేదా ఇద్దరూ సర్దుకుపోయి ఒకటయ్యారా? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బేబీ రెయిన్ డీర్ అనే వెబ్ సిరీస్ ను చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు