OTT Movie : యానిమల్ బ్యూటీ మరో బో*ల్డ్ మూవీ… ఓటిటిలోకి ఇంత ఫాస్ట్ గా

OTT Movie : యానిమల్ మూవీ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె క్రేజ్ చాలామంది స్టార్ హీరోల కంటే ఎక్కువగానే ఉంది. యానిమల్ తర్వాత వస్తున్న సినిమాలలో హీరో కంటే ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అలా తాజాగా ఈ హీరోయిన్ నటించిన ఓ బో*ల్డ్ మూవీ అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. మరి ఆ మూవీ ఏంటి? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? అని వివరాల్లోకి వెళితే…

అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలోకి

యానిమల్ పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ట్ అయిన హీరోయిన్ త్రిప్తి ఖాతాలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన బ్యాడ్ న్యూస్ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు బోల్డ్ కంటెంట్ తో సినిమాపై బాగానే హైప్ పెంచారు. థియేటర్లలోకి వచ్చాక కూడా పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే బోల్డ్ కంటెంట్ కారణంగా అదే జోరు ఎక్కువ రోజులు బ్యాడ్ న్యూస్ థియేటర్లలో కొనసాగించలేకపోయింది. ఫలితంగా అనుకున్న దానికంటే ముందుగానే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

Vicky Kaushal, Triptii Dimri, Ammy Virk share a quirky video to announce  new movie Bad Newz; slated to release in July

- Advertisement -

బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, అమీ విర్క్, త్రిప్తి కలిసి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాడ్ న్యూస్. జూలై 19న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బోల్డ్ కంటెంట్ తో ముందే ఊదరగొట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటాలంటే ఇంకా కనీసం 10 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ మూవీ ఆ రేంజ్ కలెక్షన్లను రాబడుతుందా అని ఓ పక్క డిస్కషన్స్ నడుస్తుండగా, మరోవైపు ఓటిటి లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతోంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. బ్యాడ్ న్యూస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సాధారణంగానే ఓటిటి రూల్స్ ప్రకారం ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అయిన నెల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. కానీ బ్యాడ్ న్యూస్ మాత్రం నెల కూడా కాకుండానే ఓటిటిలో అడుగు పెట్టబోతుందని సమాచారం. ఆగస్టు 16న లేదా 23న బాడ్ న్యూస్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

బ్యాడ్ న్యూస్ కథ ఏంటంటే…

హీరో విక్కీ కౌశల్ తో తృప్తికి పెళ్లవుతుంది. కానీ పెళ్లయిన కొన్ని రోజులకే ఇద్దరు మనస్పర్ధలు కారణంగా విడిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ మరో హీరోతో రిలేషన్ లఓ అడుగుపెడుతుంది. అయితే అంతలోనే వీరిద్దరిలో ఎవరో ఒకరి కారణంగా త్రిప్తి ప్రెగ్నెంట్ అయిందని ట్విస్ట్ ఇస్తారు. అంతేకాకుండా ట్విన్స్ పుట్టబోతున్నారు అంటూ డాక్టర్ షాక్ ఇస్తాడు. మరి ఇంతకీ త్రిప్తికి పుట్టబోయే ఆ బిడ్డకు తండ్రి ఎవరు? హీరో హీరోయిన్ మళ్ళీ కలిశారా? చివరికి ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ ఎలా పడింది? అనే విషయాలు తెలియాలంటే బ్యాడ్ న్యూస్ మూవీ ఓటిటిలోకి వచ్చేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు