OTT Movie : ఫ్రెండ్ కోసం ఒంటరి అమ్మాయి అరాచకం… ఈ రివేంజ్ డ్రామాను చూస్తే రక్తం మరగాల్సిందే

OTT Movie : క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో అదిరిపోయే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు ఈగో సాటిస్ఫై చేసే అంశాలు కూడా ఉంటాయి. ఇక దానికి తోడు ఇదొక రివెంజ్ డ్రామా. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు హీరో, విలన్ మధ్య జరిగే రివెంజ్ ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది. దాని కోసమైనా సరే సినిమా చూడాలనిపిస్తుంది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పటిదాకా ఈ సినిమాను చూసారా లేదా అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఈ రివెంజ్ డ్రామా మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా మొత్తం తన ఫ్రెండ్ కోసం హీరోయిన్ ఫైట్ చేస్తుంది. ఈ సినిమాను చూస్తే అంత ఈజీగా మర్చిపోలేరు. హీరోయిన్ ఎమోషన్స్ ను మీరు కూడా ఫీల్ అవుతారు.

Ballerina Korean movie 2023: How and where to watch, plot, trailer,  synopsis and more - Times of India

- Advertisement -

కథలోకి వెళ్తే…

మూవీ మొదట్లోనే ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం జరుగుతుంది. దొంగలు కౌంటర్ లో ఉన్న మనీనంతా దోచుకుంటారు. అయితే వాళ్లు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ అక్కడ లేకపోవడంతో కౌంటర్ లోనే నిలబడి ఓనర్ తో గొడవపడతారు. ఇలా రచ్చ జరుగుతున్న క్రమంలోనే హీరోయిన్ దొంగల మధ్యకు వచ్చి తనకు ఓ వస్తువు కావాలని అడుగుతుంది. అయితే దానికి కావాల్సిన అమౌంట్ ను కూడా చెల్లిస్తానని చెప్తుంది. కానీ అప్పటికే కౌంటర్లో ఉన్న క్యాష్ అంత దొంగలు దొంగిలించడంతో తనకు ఓనర్ నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులను ఆ దొంగల నుంచే తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ లో ఓ డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ ఓ అమ్మాయి డాన్స్ చేస్తూ సడన్ గా ఆలోచనలో పడి పొరపాటున కింద పడిపోతుంది. దీంతో స్టేజ్ పైనే ఆ అమ్మాయి కాలు విరిగిపోతుంది. ఆ తర్వాత ఇదే అమ్మాయి హీరోయిన్ కి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని అడుగుతుంది. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే హీరోయిన్ కి ప్లీజ్ గెట్ మీ రివెంజ్ ఫర్ మీ అనే ఒక లెటర్ కనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎక్కడుందని చూస్తే వాష్ రూమ్ లో సూసైడ్ చేసుకొని కనిపిస్తుంది. ఈ టైంలో వీరిద్దరి పరిచయం నుంచి ఇప్పుడు ఆమె చనిపోయేదాకా గతాన్ని చూపిస్తారు మేకర్స్. ఇద్దరూ బాల్య స్నేహితులు. కాగా ఒకానొక టైంలో చదువుల కోసం దూరమవుతారు. చాలా కాలం గ్యాప్ తర్వాత కలిసి అంతా హ్యాపీ అనుకునే లోపే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు హీరోయిన్ ఫ్రెండ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఎవరిపై రివెంజ్ తీర్చుకోవాలని ఆ లెటర్ రాసింది? హీరోయిన్ చివరకు తన ఫ్రెండ్ చావు వెనక దాగి ఉన్న సీక్రెట్ ను కనుక్కోగలిగిందా? రివెంజ్ తీసుకోగలిగిందా అనే విషయం తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బలెరినా అనే సినిమాను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు