OTT Movie : రానా, సమంత రొమాన్స్ ఖచ్చితంగా చూసి ఉండరు… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సెట్ కానీ కాంబినేషన్లు ఎన్నో ఉన్నాయి. ఎంత స్టార్ హీరో హీరోయిన్ అయినప్పటికీ కొన్ని కాంబినేషన్లలో సినిమాలు మాత్రం సెట్ కావు. అందుకు నిదర్శనం సమంత, రానానే. వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ అయినప్పటికీ, ఈ కాంబో మాత్రం ఇప్పటిదాకా తెరపైకి రాలేదు. తెలుగులో రాలేదు గానీ వేరే భాషలో మాత్రం వీరిద్దరూ రొమాన్స్ చేశారు. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటిటిలో చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే…

రెండు ఓటీటీల్లో..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ రెండు ఓటిటిల్లో అందుబాటులో ఉంది. ఒకటి అమెజాన్ ప్రైమ్ కాగా, మరొకటి యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. ఇక ఈ మూవీ పేరు బెంగుళూరు డేస్. టైటిల్ చెప్పగానే మలయాళ సినిమా అని గెస్ చేసి ఉంటారు. అయితే మీ గెస్ కరెక్టే. 2014లో 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 45 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా స్టార్స్ కావడం విశేషం. ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్, నివిన్ పాలి, దుల్కర్ సల్మాన్, పార్వతి ప్రధాన పాత్రలో కన్పించారు.

Bangalore Naatkal gets U certificate | nowrunning

- Advertisement -

కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునటున్న మూవీ ఇది కాదు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా తీసుకురావడానికి ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి, దిల్ రాజు ప్రయత్నాలు చేశారు. భాస్కర్ ను దర్శకుడిగా కన్ఫామ్ కూడా చేశారు. అయితే తమిళంలో ఈ మూవీ 2016లో బెంగుళూరు నాట్కల్ అనే టైటిల్ తో థియేటర్లలోకి వచ్చింది. అందులో ఆర్యమ్  శ్రీదివ్య, రానా, లక్ష్మీరాయ్, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించగా సమంత స్పెషల్ రోల్ లో మెరిసింది. తమిళంలో కూడా సూపర్ హిట్ అనిపించుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.

స్టోరీలోకి వెళ్తే…

సినిమాలో ఆర్య, శ్రీదివ్య, బాబి సింహ ముగ్గురు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. అయితే ముగ్గురివి విభిన్నమైన జీవితాలు కాగా, రానా దివ్య పెళ్లి చేసుకుంటారు. అయితే దివ్యకు ఎంబీఏ చేయాలని కోరిక బలంగా ఉంటుంది. అయినప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకుని రానాతో బెంగళూరుకి వెళ్తుంది. మరోవైపు ఆర్య మెకానిక్ కం బైక్ రేసర్ గా పని చేస్తుంటాడు. ఇక రానా పెళ్లయ్యాక శ్రీదివ్యను  పట్టించుకోకుండా ఓ గదిలోనే ఉండిపోతాడు. కనీసం ఆమెతో మాట్లాడడు. ఈ నేపథ్యంలో ఓసారి ఆయన రూమ్ లో ఉన్న సీక్రెట్ చూసి శ్రీదివ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఎయిర్ హోస్టెస్ మాయలో పడి బాబి సింహ, రేసింగ్ విషయంలో ఆర్య ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. మరి ఈ ముగ్గురు తమ సమస్యలను ఎలా తీర్చుకున్నారు? ఇందులో సమంత పాత్ర ఏంటి ? అనే విషయం తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ముఖ్యంగా సమంత, రానా రొమాన్స్ చూడాలి అనుకునేవారు ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు