OTT Movie : పెళ్ళి కూతురు డ్రెస్ లో పిల్లాడికి మాత్రమే కనిపించే దెయ్యం… ఒంటరిగా చూశారో వణికిపోవాల్సిందే

OTT Movie : మూవీ లవర్స్ ను స్క్రీన్ కి కట్టిపడేసినట్టుగా చేయగలిగే సత్తా ఉన్న సినిమాలు హారర్ మూవీస్. ఇవి ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయంటే ఒక్క సీన్ కూడా మిస్ చేయకుండా ఉండడానికి అవసరమైతే కనురెప్పలు కొట్టడం కూడా మర్చిపోతారు. ఇక ప్రస్తుతం ఓటీటీలో లెక్కకు మించిన హారర్ మూవీస్ ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే అందులోనూ కొన్ని సినిమాలను మాత్రం చూస్తే ఆపడం కష్టం అనిపిస్తుంది. అలాంటి ఓ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని చూసారా లేక మిస్ అయ్యారా? ఇప్పుడు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

కథ విషయానికి వస్తే…

సినిమా మొత్తం ఒక దెయ్యం, సూర్య అనే ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉండగా. ఓ రోజు ఏకంగా అర్ధరాత్రి వయోలిన్ వాయిస్తూ తల్లిని భయపెడతాడు. దీంతో సూర్య తల్లి భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని రోజులు తనతో కలిసి ఎక్కడైనా బయట స్పెండ్ చేస్తే అంతా సెట్ అవుతుందని చెప్తాడు. ఇక సూర్య తల్లి ఊర్లోని ఓ బంగ్లాకు షిఫ్ట్ అవుతారు. అయితే ఆ బంగ్లా పాతది, పైగా అందులో ఎవ్వరు ఉండరు. అలాంటి బంగ్లా లోకి సూర్య ఫ్యామిలీ మారుతుంది. ఇక కొత్త ప్రాంతం కావడంతో సూర్య గ్రామం అంతా తిరుగుతూ సంతోషంగా గడుపుతాడు. ఇంతలోనే అక్కడొక దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది.

Bhootpori - Disney+ Hotstar

- Advertisement -

ఈ క్రమంలోనే ఆ ఊరికి దగ్గరలోనే దుర్గాబరి అని అడవి ఉందని, అందులో భూతం ఉందని గ్రామస్తులు చెప్పుకోవడం తెలుస్తుంది. అయితే ఆ భూతం పెళ్లి కూతురు డ్రెస్ లో తిరుగుతుందని, దానితో కలిసి అడవిలోకి వెళ్ళొద్దని గ్రామస్తులు ఈ పిల్లాడిని హెచ్చరిస్తారు. అప్పటికి సూర్య భయపడతాడు గాని ఓ రోజు తన తెలియకుండానే ఎవరినో ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ నేపథ్యంలోనే సూర్యకు భాను అనే అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. అయితే సూర్య ఆమె ఆత్మ అని తెలియక అందరిలాగే మాట్లాడతాడు. అప్పటిదాకా ఎవరికి కనిపించని ఆమె సూర్యకు కనిపించడంతో షాక్ అవుతుంది.  అయితే భాను మాత్రం అతన్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. పైగా ఇంకోసారి కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. మరి అడవిలో పెళ్లి కూతురులా రెడీ అయి తిరిగే ఆత్మ భానుదేనా? అసలు ఆమె సూర్యకు ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు తనతో బాగా మాట్లాడుతున్న ఆ చిన్న పిల్లాడిని భయపెట్టడానికి ట్రై చేసింది? చివరికి స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బూత్ పోరి అనే సినిమా పై ఓ లుక్ వెయ్యండి. ముఖ్యంగా హారర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ బూత్ పోరి సినిమాను చూడడం అస్సలు మిస్ కావద్దు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు