OTT Movie : కళ్ళకు గంతలతో చావుబతుకులాట, చూస్తే చావే… భయంతో చెమటలు పట్టించే మూవీ

OTT Movie : ఓటిటి అనే మహా సముద్రంలో లెక్కలేనన్ని సినిమాలు, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో మనకు కావాల్సిన కంటెంట్ ను వెతుక్కోవడం అంటే సముద్రంలో సూదిని వెతకడం లాంటిదే. ఇలా ఫీల్ అయ్యే వాళ్ల కోసమే ఓటీటీలో ఉన్న ఓ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఈరోజు మన మూవీ సజెషన్ గా తీసుకొచ్చాము. ఈ మూవీ లైన్ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకునే బ్రతకాలి అక్కడ. తీసి చూస్తే చావే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్  అవుతోంది ? మూవీ పేరేంటి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు అడ్డా నెట్ ఫ్లిక్స్. ఈ సూపర్ కంటెంట్ మూవీ కూడా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోంది. అదిరిపోయే స్టోరీతో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లతో సాగే ఈ మూవీ పేరు బర్డ్ బాక్స్. మూవీని చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి సినిమాలో వాళ్లంతా కళ్ళకు గంతలు కట్టుకొని ఎలా బ్రతుకుతున్నారు ? అవి తీసేస్తే ఏమవుతుంది ? అనే విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్దాం.

Books to Film: Josh Malerman's Debut 'Bird Box' Lands on Netflix

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

సినిమాలో హీరోయిన్ పేరు మలోరి. తన ఇద్దరు పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి బోట్లో తీసుకెళ్తుంది ఆమె. గతంలోకి వెళ్తే మలోరీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. హాస్పిటల్లో తన చెల్లెలితో కలిసి చెకప్ కు వెళ్ళగా, అక్కడ కొంత మంది విచిత్రంగా ప్రవర్తించడం కన్పిస్తుంది ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో మలోరీ  చెల్లెలు కూడా ఇలాగే ప్రవర్తించి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. దీంతో భయపడి పోయిన మలోరిని ప్రెగ్నెంట్ గా ఉండడం చూసి అక్కడే ఉన్న మరొక ఆవిడ తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆమె కూడా కాలిపోతున్న కార్ లో కూర్చుని మరీ సూసైడ్ చేసుకుంటుంది. అసలు ఏం జరుగుతుందో మలోరితో పాటు ఎవ్వరికి అర్థం కాదు.

ఓ వ్యక్తి వచ్చి కొన్ని వింత జీవులు మనుషుల్ని చంపేస్తున్నాయని చెప్తాడు. అయితే కళ్ళకు కనిపించని ఆ జంతువులు ఎలాగో కెమెరాలో రికార్డు అవుతాయి కాబట్టి చూద్దామని ప్రయత్నించిన మిగతా వాళ్ళు కూడా చనిపోతారు. ఇక మలోరితో సహా మరి కొంతమంది టీంగా మారి ఆ వింత జీవుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే కళ్ళకు గంతలు కట్టుకుంటారు. కళ్లకు గంతలు తీసారంటే వాళ్ళు చనిపోతారు. మరి ఆ వింత క్రియేచర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని చూసినప్పుడు ఎందుకు చనిపోతున్నారు? మలోరి తన ఇద్దరు పిల్లలను ఆ వింత జీవుల నుంచి ఎలా కాపాడుకుంది ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే బర్డ్ బాక్స్ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు