OTT Movie : బిడ్డతో బిర్యానీ వండి పెట్టే వేశ్య… స్పెషల్ గా ఆ కొంతమందికే

OTT Movie : వేశ్యల జీవితాలపై తెరకెక్కిన ఎన్నో సినిమాలను ఇప్పటిదాకా మనం చూసాము. అలాంటి సినిమాలో వేశ్యలను ఎంత దారుణంగా చూస్తారు? వాళ్ల పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలను మనసుకి హత్తుకునే విధంగా చూపించారు పలువురు దర్శకులు. ఈరోజు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ మూవీని మన మూవీ సజెషన్ లో తెలుసుకోబోతున్నాం. ఒంటరి మహిళ తన కష్టాల కొలిమిని ఎలా దాటింది అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారేమో.. అది బో*ల్డ్ మూవీనే. ఎన్నో అవార్డులు దక్కించుకున్న మూవీ. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే వివరాల్లోకి వెళితే….

ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో స్ట్రీమింగ్…

ఇన్ని రోజులు మనం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లేదా ఆహా వంటి పలు పాపులర్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల గురించి చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అనే ఓటిటిలో అందుబాటులో ఉన్న మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మూవీ పేరు బిరియాని. ఇదొక మలయాళ మూవీ. మలయాళ మూవీలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తినడానికి తిండి లేక, చుట్టుపక్కల వారంతా అంటరాని వాళ్ళలా చూడడం, తల్లి చనిపోవడం, తమ్ముడు కోసం ఎదురు చూపులు.. ఇంతటి కష్టాల్లో ఉన్న ఆ మహిళ తన బిడ్డనే బిర్యాని వండేసి వడ్డిస్తుంది. అది కూడా కొంతమందికి మాత్రమే. మరి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం పదండి.

Biriyaani (2019) IMDb, 58% OFF | www.risolo.it

- Advertisement -

కథ ఏంటంటే ?

ఈ మూవీలో హీరోయిన్ పేరు కదీజా. హీరోయిన్ తో పాటు ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు ఉండే కుటుంబం ఉంటారు. అనారోగ్యంతో ఉండే తల్లి, చేపల వేటకు వెళ్లి తిరిగిరాని తమ్ముడు, చనిపోయిన తండ్రి.. ఇలా ఉంటుంది ఆమె జీవితం. తమ్ముడు ఉగ్రవాదుల్లో చేరాడు అంటూ తరచుగా పోలీసులు ఎంక్వయిరీ కి రావడంతో తమ మత పెద్దలు ఈ కుటుంబాన్ని వెలివేస్తారు.. తండ్రి చనిపోయాక రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తారు. వీళ్ళ కష్టాలు చూసి బాధపడిన తమ్ముడి ఫ్రెండ్ ఈ తల్లి కూతుర్లను వేరే ప్లేస్ కి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఏం చేయాలో తెలియని కదీజా వేశ్యగా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె తమ్ముడు పోలీసుల కాల్పుల్లో చనిపోతాడు. తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఇంతటి కష్టాల కొలిమిలో ఉన్న ఆమెకు మరో బాంబు లాంటి వార్త తెలుస్తుంది. వేశ్య అయిన తాను తల్లి అయ్యాను అని తెలుసుకుంటుంది. ఆ బిడ్డ కోసం అయినా బ్రతకాలని దృఢమైన నిర్ణయం తీసుకున్న కదీజాతో విచారణ పేరుతో పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తారు. దీంతో కడుపులోనే ఆ బిడ్డ చనిపోతుంది. తనతో ఇంత దారుణంగా ప్రవర్తించిన అందరిపై పగ తీర్చుకోవాలనే ఆలోచనతో కదీజ అందరికీ బిర్యానీ వండి పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఏకంగా చనిపోయిన తన బిడ్డతో ఆ బిర్యానీ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఈ కన్నీళ్లు తెప్పించే సినిమాను చూసేటప్పుడు పిల్లలు లేకుండా ఉండేలా చూసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు