OTT Movie : డ్యాన్స్ పేరుతో టీచర్ అరాచకాలు… అమ్మాయి లొంగలేదని ఏం చేశాడంటే?

OTT Movie : టీచర్ల పేర్లతో అమ్మాయిలపై అరాచకాలు చేసే మూర్ఖుల గురించి ఇప్పటిదాకా ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం మనం. అలాగే ఇలాంటి కథతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి కూడా. ఇలాంటి స్టోరీ లైన్ తోనే ఒక క్రేజీ థ్రిల్లర్ మూవీని ఈరోజు మన మూవీ సజెషన్లో తీసుకొచ్చాం. ఈ మూవీ వచ్చి ఎన్నో ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ లో ఉండడం విశేషం. ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం పదండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

టైటిల్ చూడగానే ఇదొక బోల్డ్ మూవీ అనిపిస్తుంది. అయితే అలాంటిదే అయినప్పటికీ మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది ఈ మూవీలో. 14 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్  మూవీ ఇప్పటికే బెస్ట్ మూవీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే ట్విస్టులు, టేకింగ్, కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. పైగా సినిమా మొత్తం ఒక అమ్మాయి చుట్టే తిరుగుతుంది. ఈ మూవీ పేరు బ్లాక్ స్వాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్దాం పదండి.

Watch Black Swan | Prime Video

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఓ అమ్మాయి ఎన్ పాయింట్ అనే డాన్స్ ను నేర్చుకుంటుంది. ఇదొక వెస్ట్రన్ స్టైల్ డాన్స్. హాలీవుడ్ సినిమాలను చూసే వాళ్లకు ఈ డాన్స్ గురించి బాగా తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే మునివేళ్లపై చేసే డాన్స్. మొత్తానికి ఈ డాన్స్ లో పర్ఫెక్ట్ అయిన అమ్మాయే  హీరోయిన్. కానీ ఆ డాన్స్ నేర్పించే టీచర్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. పైగా ఈ అమ్మాయిపై స్పెషల్ గా కేర్ చూపిస్తాడు. అయితే నిజానికి అది కేరింగ్ కాదు అతను ఆమెను లొంగ తీసుకోవాలి అని ప్రయత్నిస్తాడు. డాన్స్ చేస్తున్న టైంలో ఎక్కడెక్కడో చేతులు వేసి ఆ అమ్మాయిని వేధిస్తాడు. ఒకానొక టైం లో డైరెక్ట్ గానే తన మనసులోని మాటను బయట పెట్టగా హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది.

ఇక అప్పట్నుంచి టార్చర్ మొదలవుతుంది. ఈ అమ్మాయిని పక్కన పెట్టి క్లాస్ లో ఉన్న మరో స్టూడెంట్ తో ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడు. దీంతో బెస్ట్ డాన్సర్ అయిన హీరోయిన్ లీడ్ డాన్సర్ గా చేసే అవకాశాన్ని కోల్పోతుంది. ఆమెను మెంటల్ గా కుంగిపోయే విధంగా చేస్తాడు ఆ డాన్స్ మాస్టర్. మరి అతని అరాచకాలు అన్నిటిని తట్టుకొని హీరోయిన్ తన లైఫ్ లో ఎలా నిలబడింది ? అతడికి ఎలా గుణపాఠం చెప్పింది ? డ్యాన్స్ మాస్టర్ ను ఎలా ఎదుర్కొంది? అనే విషయాలు తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ స్వాన్ అనే మూవీని చూడాల్సిందే. అమ్మాయిలు తమ రైట్స్ కోసం ఎలా పోరాడాలి? ఇలాంటి కీచకుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను తెలిపే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు