OTT Movie : ఈ ఊళ్లోకి అడుగుపెడితే చావే… మనుషుల్ని చంపి వండుకుని కడుపారా ఆరగిస్తారు

OTT Movie : ఇప్పటిదాకా ఎన్నో హారర్, సస్పెన్స్, సైకలాజికల్ సినిమాలను చూసే ఉంటారు. ఈరోజు మన మూవీ సజెషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏకంగా మనుషుల్ని చంపుకుని తినే నరమాంస భక్షకుల గురించి ఈ మూవీ. సాధారణంగా నాన్ వెజ్ తినే వారికి దానికి సంబంధించిన ఎలాంటి వంటకాన్ని చూసినా వెంటనే నోరూరిపోతుంది. తినేదాకా ఆకలి చల్లారదు, మనసు కుదుట పడదు. అలాగే ఈ మూవీలోని మనుషులకు కూడా మనిషిని చూస్తే ఇలాగే అనిపిస్తుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు

ఓటిటిలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ నరమాంస భక్షకులకు సంబంధించిన సినిమాలు మాత్రం చాలా అరుదని చెప్పాలి. హాలీవుడ్ లో కూడా ఇలాంటి సినిమాలను వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే బోయే మూవీ కూడా ఇదే కేటగిరికి చెందింది. అయితే ప్రేక్షకులను నిరాశపరిచే విషయం ఏమిటంటే ఈ మూవీని ఫ్రీగా చూడలేరు. ఈ మూవీ పేరు బోన్స్ అండ్ ఆల్. పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ లో రూ.119కే ఈ మూవీని రెంట్ కట్టి చూడొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ ఇంకో ఓటిటీ ప్లాట్ఫామ్ యాపిల్ టీవీ ప్లస్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అందులో కూడా రూ.150 కట్టి రెంట్ బేసిస్ లోనే చూడాల్సి ఉంటుంది.

Prime Video: Bones and All

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ దాదాపుగా మృగంలాగా ప్రవర్తిస్తుంది. ఆమెకు ఆకలేసింది అంటే చాలు ఓ మనిషి చచ్చి తీరాల్సిందే. అయితే ఈ విషయాన్ని ఆమెతోపాటు ఆమెను పెంచిన తండ్రి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఓ రోజు ఆమె ఏకంగా స్నేహితులను తినేస్తుంది. అయితే ఈ విషయం బయటపడేలోగా తండ్రి ఎవరి కంటికి కనిపించకుండా ఆమెను ఊరు దాటిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతనికి కూడా అచ్చం తన లాంటి సమస్య ఉందని తెలుసుకొని అతనితో స్నేహం చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ముసలాడు కనిపించి వీళ్లను వాళ్ళలాగే ప్రవర్తించే చాలామందికి పరిచయం చేస్తాడు. అయితే నిజానికి ఇలాంటి కమ్యూనిటీ ఒకటి ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు సేఫ్ గా ఉండాలి. కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వీళ్ళకు కష్టాలు ఎక్కువవుతాయి. అందరూ వీళ్ళనే చంపాలి అని అనుకుంటారు. ఇంతకీ ఎందుకు వీళ్లను చంపాలి అనుకుంటున్నారు? అసలు అంతమందిని చంపేసిన ఈ నరమాంస భక్షకులు ఎవరికి దొరక్కుండా ఎలా తప్పించుకోగలుగుతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమాపై ఓ లుక్ వెయ్యండి. అద్భుతమైన థ్రిల్లింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునేవారు మిస్ అవ్వకుండా చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు