OTT Movie : క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్… సోషల్ మీడియా పిచ్చి ఉన్నవాళ్లు మస్ట్ వాచ్

OTT Movie : ఓటిటిలో ఇప్పటికే ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మనకు రెగ్యులర్ లైఫ్ లో టచ్ అయ్యే అంశాలతో తెరకెక్కి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటి ఒక క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమాను చూడడం మొదలు పెడితే ఆపడం చాలా కష్టం. ఎందుకంటే ఇదొక ఫ్యూజులు అవుట్ అయ్యే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మరి ఈ మూవీ పేరేంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ స్టోరీ, గ్రిప్పింగ్ నరేషన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాదు థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఓ రేంజ్ లో నచ్చేస్తుంది. ఒకానొక టైం లో ఈ సినిమా ఇంటరెస్టింగ్ గా ఉండడంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తుంది. ఏఐ టెక్నాలజీ ప్రమాదకరం అనేది చాలామంది వాదన. ఈ ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒకరి ఐడెంటిటీని మరొకరు కాజేయడం అన్నది ఏఐ వల్ల మరింత ఈజీగా మారుతుంది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. ఇక ఈ సినిమాలో కావలసినన్ని ట్విస్టులతో పాటు కొన్ని సీన్స్ బో*ల్డ్ గా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

The Ending Of Cam Explainedస్టోరీ ఏంటంటే…

ఈ సినిమాలో హీరోయిన్ ఒక క్యామ్ గర్ల్ పాత్రలో కనిపిస్తుంది. ఇక ఆమెకి భారీ సంఖ్యలోనే ఫాలోవర్స్ ఉంటారు. అంతేకాకుండా తన ఫాలోవర్స్ అడిగే కొన్ని క్రేజీ పనులను చేయడానికి కూడా వెనకాడదు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు హీరోయిన్ వీడియోలకు క్రేజ్ పెరుగుతుంది. కానీ ఓ రోజు హఠాత్తుగా ఉదయాన్నే నిద్ర లేచే సరికి తన ఎకౌంట్ హ్యాక్ అయి ఉంటుంది. ఎంత ట్రై చేసినా హీరోయిన్ తన అకౌంట్ ని యాక్సస్ చేయలేక పోతుంది. కానీ ఆ ఎకౌంటు మాత్రం లైవ్ లో నడుస్తూ ఆమె కంటే బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్ కి అసలు విషయం తెలుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే అచ్చం తనలాగే ఉండే మరో అమ్మాయి ఆ ఎకౌంట్ ని హ్యాండిల్ చేస్తుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తాను ఫాలోవర్స్ ను తెచ్చుకోవడానికి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని, తన ఎకౌంటుని ఎలాగైనా తిరిగి తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరి హీరోయిన్ ఆ ఎకౌంట్ ని చేజిక్కించుకోవడానికి ఏం చేసింది? అసలు ఆమె లాగే ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు హీరోయిన్ ఎకౌంట్ ని హ్యాక్ చేసింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలకు సమాధానం తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్యామ్ అనే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు