OTT Movie : పిచ్చెక్కించే యాక్షన్ మూవీ… ఆర్జీవీ మెచ్చిన ఈ సినిమాను ఏ ఓటిటీలో చూడొచ్చు అంటే…

OTT Movie : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు అనే మాటే ముందుగా వినిపిస్తుంది. కానీ ఆయన టేకింగ్, కెమెరా వర్క్ కు, ఆయన చూపించే ఒక్కో సీన్ కు మూవీ లవర్స్ పిచ్చెక్కిపోతారు. అలా స్క్రీన్ మీద ఆయన చూపించిన ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. కానీ ఆర్జీవి మాత్రం ఓ మూవీ టేకింగ్ కి ఫ్లాట్ అయిపోయాడు. ఏకంగా ఆ టేకింగ్ ఏంట్రా బాబు అంటూ అందరి దృష్టిని ఆ మూవీ వైపుకే తిప్పేసాడు. ఈరోజు మన మూవీ సజేషన్ కూడా ఆర్జీవికి నచ్చిన ఆ మూవీనే. మరి ఈ మూవీ ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

యాక్షన్ మూవీ లవర్స్ కు పిచ్చెక్కించే సీన్స్ ఉన్న మూవీ ఇది. 2022లో ఆర్జీవి ఓ సినిమాలోని యాక్షన్, డైరెక్టర్, కెమెరామెన్, మూవీ డైరెక్టర్ లను పొగుడుతూ ట్వీట్ వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్జీవి పొగడడమే ఆలస్యం చాలామంది వెంటనే ఆయన చెప్పిన మూవీని చూశారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అదే. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కెయ్యండి. అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు కార్టర్. ప్రస్తుతం దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు వైలెన్స్ కూడా ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి. కాబట్టి హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు సినిమాను చూడకపోతే బెటర్.

Carter' Review - A Netflix Movie That's Unwatchable Due To Its Irreverence For Quality Action Film-making

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో తనకు తెలియని ఒక ప్రదేశం లో కళ్ళు తెరుస్తాడు. అయితే అలాంటి విచిత్రమైన ప్లేస్ లో నిద్ర లేచిన అతనికి తాను ఎవరు ? అక్కడకు ఎందుకు, ఎలా వెళ్ళాడు అనే విషయం అస్సలు తెలీదు. కనీసం తను ఏం చేస్తున్నాడో కూడా క్లారిటీ ఉండదు. కానీ ఓ వాయిస్ మాత్రం అతని చెవిలో వినిపిస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు అతనికి సలహాలు, సూచనలు ఇస్తూనే బెదిరిస్తుంది కూడా. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో హీరో వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ వెళ్తాడు. అందులో భాగంగానే ఒక పాపను కాపాడుతాడు. ఇంతకీ ఆ పాప ఇతనికి ఏమవుతుంది? ఎందుకు వాళ్ళు ఇతడిని కంట్రోల్ చేస్తున్నారు? అసలు హీరోని కంట్రోల్ చేసేది ఎవరు? ఇతన్నే ఎందుకు టార్గెట్ చేశారు? అనే ఈ ఇంటరెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కార్టర్ మూవీని చూసి తీరాల్సిందే. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ ను ఇష్టపడేవారు డోంట్ మిస్. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఈ సినిమాను చూసినప్పటికి మరో సారి పూర్తిగా నిమాగ్నమయ్యేలా చేయగలిగే సినిమా ఇది. కాబట్టి ఈ వర్త్ వాచింగ్ మూవీని మళ్లీ చూడవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు