OTT Movie : మీరు ఓటిటిలో వివిధ రకాల వెబ్ సిరీస్‌లను ముఖ్యంగా క్రైమ్ కథా చిత్రాలను చూడటానికి ఇష్టపడితే, ఈరోజు మన మూవీ సజెషన్ మీ కోసమే. ఈ వెబ్ సిరీస్‌లను మీరు ఇంట్లో కూర్చొని హాయిగా చూడవచ్చు. ఇది క్రైమ్ వెబ్ సిరీస్ అయినప్పటికీ ఈ వారాంతంలో ఎక్కడికీ వెళ్లాలని ప్లాన్ చేయకపోతే ఇంట్లోనే సరదాగా ఈ వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. కాకపోతే ఇవి పగటి పూట కూడా వణికించే విధంగా ఉంటాయి కాబట్టి ఒంటరిగా ఈ క్రైమ్ డ్రామాలను చూడాలంటే గట్స్ ఉండాల్సిందే.
కల్కూట్
సుమిత్ సక్సేనా తెరకెక్కించిన ‘కల్కూట్’ క్రైమ్ డ్రామా సిరీస్. విజయ్ వర్మ, సీమా బిస్వాస్, శ్వేతా త్రిపాఠి, సుజానా ముఖర్జీ, యశ్పాల్ శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
రఫూచక్కర్
‘రఫూచక్కర్’ కూడా అలాంటి చిత్రమే. డైట్ బిస్కెట్ల నుండి విమానయాన సంస్థల వరకు వింత మోసాలకు పాల్పడిన పవన్ అలియాస్ ప్రిన్స్ కథ ఇది. ఈ సినిమాలో మనీష్ పాల్ అద్భుతంగా నటించాడు.
అఫరాన్
‘అఫరాన్’ వెబ్ సిరీస్ 2018 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో అరుణోదయ్ సింగ్ కీలక పాత్రలో కనిపించారు. దీని మొదటి సీజన్ ఆల్ట్ బాలాజీలో వచ్చింది, రెండవది జియో సినిమాలో ఉంది.
దో గుబ్బారే
‘దో గుబ్బారే’ కథ కూడా క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మోహన్ అగాషే, సిద్ధార్థ్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. జియో సినిమాలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
వన్ ఫ్రైడే నైట్
వివాహితతో సన్నిహితంగా మెలిగే నిరోషా అనే అమ్మాయి ఆధారంగా ‘వన్ ఫ్రైడే నైట్’ కథ సాగుతుంది. స్టోరీ మంచి ట్విస్ట్ తో ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది.
దురంగ
‘దురంగ’ కథ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఇరా జైకర్ పటేల్ (దృష్టి ధామి) చుట్టూ తిరుగుతుంది. ఇరా భర్త సమిత్ పటేల్ (గుల్షన్ దేవయ్య) ఒక కళాకారుడు. అతని పోలీసు అధికారి భార్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంటే, అతను తన కుటుంబాన్ని, పిల్లలను సంతోషంగా చూసుకుంటాడు.
ఆటోశంకర్
చెన్నై సీరియల్ కిల్లర్ గౌరీ శంకర్ కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆటో శంకర్’ కూడా చాలా భయానకమైన కథే. అతని భయంతో మహిళలు వీధుల్లోకి రావడం మానేశారు. ఎందుకంటే అతను మహిళలను టార్గెట్ చేసి వరుసగా హత్యలు చేశారు. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హసీన్ దిల్రూబా
తాప్సీ పన్ను ఈ చిత్రంలో తన భర్త హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న అందమైన గృహిణిగా నటించింది. సినిమాలో మిస్టరీని, రొమాన్స్‌ని అందంగా మిళితం చేశాడు డైరెక్టర్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హసీన్ దిల్రూబా మూవీకి సీక్వెల్ గా ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ఇటీవలే విడుదలైంది. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లోనే ఉంది.