OTT Movie : ఆ తప్పు చేశారని తెలిస్తే చంపేసే సీరియల్ కిల్లర్… అపరిచితుడు మించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ అంటే చెమటలు పట్టించే భయంకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమా మొత్తం చూసే దాకా నిద్ర పట్టదు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఓటీటీలో ఎన్నో క్రైమ్ జోనర్ సిరీస్ లు, మూవీస్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని చూశాక అపరిచితుడును మించిన మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

ఓటిటిలో చూడలేరు…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సిరీస్ ను ఓటీటీలో చూడలేరు. ఎందుకంటే ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్సైట్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సిరీస్ పేరు డెక్స్ టర్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కుర్రాడిగా ఉన్న ఈ సిరీస్ హీరో మూసలాడు అయ్యే వరకు అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. మొత్తం 7 సీజన్లు ఇప్పటిదాకా పూర్తయ్యాయి. అయితే సినిమాలో జరిగే హత్యలు వైలెంట్ గా ఉంటాయి కాబట్టి హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు ఈ సిరీస్ ను చూడకుండా ఉంటే బెటర్.

Serial killer series Dexter returning for limited revival at Showtime

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరోకు చిన్నప్పటి నుంచి ఒక దారుణమైన అలవాటు ఉంటుంది. అతనికి రక్తాన్ని చూస్తే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. అందుకే ఆ రక్తాన్ని చూడడానికి హత్య చేయడానికి కూడా వెనకాడడు. పైగా హత్య చేశాక దొరకాకుండా ఎలా తప్పించుకోవాలో కూడా బాగా తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే అతనికి తెలిసినంతగా పోలీసులకు కూడా తెలియదనే చెప్పాలి. అయితే నిజానికి ఈ విషయం గురించి తెలుసుకున్న అతని తండ్రి హీరోని మంచి మార్గంలో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగానే తనకు ఉన్న ఈ రాక్షసానందాన్ని తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి వాడమంటూ మోటివేషన్ ఇస్తాడు. కానీ అంతకంటే ముందు హీరో తండ్రి అతనికి ఉన్న ఈ అలవాటును మాన్పించడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఇక కంట్రోల్ చేయలేను అని భావించి ఇలా మంచి పని చేయమని చెప్తాడు. ఇంకేముంది తండ్రి అలా చెప్పడంతో హీరో అడ్డు అదుపు లేకుండా తప్పు చేసి, చట్టం నుంచి తప్పించుకుని తిరిగే నేరస్తులను వరుసగా చంపుతాడు. కానీ అతను ఒక సీరియల్ కిల్లర్ అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇక మరోవైపు మెట్రో పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ అనలిస్ట్ గా కూడా హీరో వర్క్ చేస్తాడు. కానీ అతనేవరో కనీసం అక్కడ కూడా ఎవరికీ తెలియదనే చెప్పాలి. అయితే కొన్నాళ్ళ తరువాత హీరోలో ఆ ఆలోచనలు తగ్గుతాయి. మరి హీరో పూర్తిగా మంచి వాడిగా మారాడా ? అసలు తప్పులు చేస్తే ఇంత క్రూరంగా చంపుతారా? అని డౌట్స్ వస్తే ఈ సిరీస్ పై లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు