OTT Movie : నరాలు తెగే ట్విస్టులు… ఇదెక్కడి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీరా మావా

OTT Movie : ఇప్పటికే ఎన్నో జానర్ల సినిమాలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి దిగగా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అన్నిట్లోకెళ్లా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇక ఇలాంటి సినిమాలు ఇష్టపడే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ట్విస్టుల మీద ట్విస్టులు ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూశారంటే ఇదెక్కడ మూవీ రా మామ అని థ్రిల్ అవ్వాల్సిందే. మరి ఇంతకీ ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. మంచి సస్పెన్స్ అంశాలతో సీన్ సీన్ కు ఓ ట్విస్ట్ ఉంటూ నరాల తెగే సస్పెన్స్ ను మెయింటైన్ చేసే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది డోంట్ బ్రీత్. స్టీఫెన్ లాంగ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఆయన అవతార్ సినిమాలో కమాండర్ గా కూడా నటించారు. ఈ సినిమాలో కళ్ళు లేని వ్యక్తిగా అతని నటనకి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నాం కాబట్టి ఏదో సస్పెన్స్ తో నెట్టుకొస్తారు అనుకుంటే మీరు తప్పు లో కాలేసినట్టే. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న ఈ మూవీని ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కెయ్యండి.

Don't Breathe Review. Can one bad plot twist ruin a whole… | by Sean Mott |  Medium

- Advertisement -

కథలోకి వెళ్తే…

హీరోకి ఈ సినిమాలో కళ్ళు కనిపించవు. సింగిల్ గా ఉంటాడు. ఇలాంటి వారే కదా దొంగలకు కావాల్సింది. అలా ఓ ముగ్గురు స్నేహితులు ఈ కళ్ళు లేని వ్యక్తిని గమనిస్తూ ఉంటారు. ఎట్టకేలకు ఆయనకు కళ్ళు కనబడవు అని కన్ఫామ్ చేసుకుని, అతనికి తెలియకుండా ఇంట్లోకి చొరబడి దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ తీరా ఇంట్లోకి వెళ్ళాక ఆ వ్యక్తి చేసిన పనులు చూసి దీనికంటే నరకమే బెటర్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఒక కళ్ళు కనిపించని వ్యక్తి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతగానో పోరాడుతారు ఈ ముగ్గురు. వాళ్లను అంతగా భయపెట్టడానికి గుడ్డి వాడైన ఆ హీరో ఏం చేశాడు? ఇంతకీ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ కళ్ళు లేని వ్యక్తి దగ్గర దొంగతనం చేయగలిగారా ? అసలు ఆ కళ్ళు లేని వ్యక్తి ఇంత క్రూరంగా, తెలివిగా ఎలా ఉన్నాడు ? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? చివరికి ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరైనా ప్రాణాలతో బయటపడ్డారా లేదా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ఆసక్తికరమైన మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు