OTT Movie : లోన్ ఇవ్వనందుకు చేతబడి… భయం స్పెల్లింగ్ రాయించే మూవీ

OTT Movie : పొలిమేర, విరుపాక్ష మూవీలు రిలీజ్ అయ్యాక చేతబడి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతమైన ఆసక్తి పెరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ కూడా మారిపోయింది. ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక వరుసగా చేతబడి నేపథ్యంలో సినిమాలు రావడం హిట్ అవ్వడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఇంకా ఓటీటీలో ఉన్న అలాంటి చేతబడి నేపథ్యం సినిమాలు చూడాలి అనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ హారర్ మూవీని చూసారంటే కచ్చితంగా భయం స్పెల్లింగ్ రాయిస్తుంది. అసలు ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కింది. లోన్ ఇవ్వలేదని ఓ ముసలావిడ ఏకంగా చేతబడి చేసి భయపెడుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా పేరు డ్రాగ్ మీ టు ది హెల్. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Things You Didn't Know About Sam Raimi's Drag Me To Hell

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో వాడి తల్లిదండ్రులు అతడిని తీసుకొని ఆత్మలతో మాట్లాడే ఓ లేడీ దగ్గరకు వెళ్తారు. ఆమె సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడికి ఒక భయంకరమైన ప్రేతాత్మ వచ్చి ఆ అబ్బాయిని భూమిలోకి ఈడ్చుకెళ్ళిపోతుంది. ఇక 40 ఏళ్ల తర్వాత సినిమా మొదలవుతుంది. ఓ లోకల్ బ్యాంక్ లో క్రిస్టిన్ అనే అమ్మాయి లోన్ ఆఫీసర్ గా పని చేస్తుంది. కానీ ఆమె బ్యాంక్ అసిస్టెంట్ అవ్వాలని ఆశపడుతుంది. మేనేజర్ తో ఈ విషయం గురించి డిస్కషన్ చేస్తే నువ్వు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేవు అంటూ ఆ ప్లేస్ ను ఆఫీస్ లో పని చేసే మరో అమ్మాయికి ఇవ్వాలని డిసైడ్ అవుతాడు.

ఈ నేపథ్యంలోనే బ్యాంకు కి ఓ ముసలావిడ వస్తుంది. క్రిస్టిన్ దగ్గరికి వెళ్లి తాను ఇంటి లోను కట్టలేకపోతున్నానని, లోన్ ఎక్స్టెన్షన్ చేయమని కోరుతుంది. కానీ మేనేజర్ తీరుతో హార్ట్ అయిన క్రిస్టిన్ ఈసారి టఫ్ డెసిషన్ అంటే ఏంటో చూపిస్తా అంటూ ముసలావిడకు లోన్ ఎక్స్టెన్షన్ చేయడం కుదరని ముఖం మీద చెప్పేస్తుంది. దీంతో ఆవిడ ఆమెను తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

సాయంత్రం అయ్యాక క్రిస్టిన్ ఇంటికి వెళ్తుండగా ముసలావిడ అడ్డొచ్చి ఆమె డ్రెస్ నుంచి చిన్న బటన్ లాక్కొని మంత్రాలు చదువుతూ వెళ్ళిపోతుంది. దీంతో భయపడిన క్రిస్టియన్ స్పిరిచ్యువల్ అడ్వైజర్ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో చెప్తుంది. అప్పటి నుంచి ఆమెకు వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. దీంతో ఆ ముసలావిడ దీనంతటికీ కారణం అనుకుని ఆమెకు సారీ చెబుదామని అంతే తీరా ముసలావిడ చనిపోయి కనిపిస్తుంది. మరి క్రిస్టిన్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడింది ? అనే విషయం తెలియాలంటే డ్రాగ్ మీ టు ది హెల్ అనే మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు