OTT Movie : ఫస్ట్ నైట్ ముందే అమ్మాయిలకు ఆ పరీక్ష… ఫ్యూజులు అవుట్ అయ్యే ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే…

OTT Movie : అమ్మాయిల విషయంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. అమ్మాయి నవ్వద్దు, పరిగెత్తొద్దు, సూటిగా చూడకూడదు అంటూ ఇంకా వంటింటి కుందేళ్ళ లాగా చూసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ పై వచ్చి ప్రశంసలు దక్కించుకున్న మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ పేరేంటి? కథ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

జియో సినిమాలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ఏక్ కోరి ప్రేమ్ కథ. బాలీవుడ్ నటులు అక్షయ్ ఒబెయ్, ఖనక్ బుదిరాజా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పై విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయికి కన్యత్వ పరీక్ష పెట్టే దురాచారం అనే స్టోరీ లైన్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూలై 25న జియో సినిమాలో ఏక్ కోరి ప్రేమ్ కథను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ మూవీకి చిన్మయి పురోహిత్ దర్శకత్వం వహించారు. అయితే నరేషన్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. సుగంద్ ఫిలిమ్స్, కెనిల్ వర్త్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

EK Kori Prem Katha: Khanak Budhiraja की मोस्ट अवेटेड 'एक कोरी प्रेम कथा' का टीजर हुआ रिलीज, फिल्म में लड़कियों के कौमार्य परीक्षण कुप्रथा से उठाया जाएगा ...

- Advertisement -

కథ ఏంటంటే….

ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామంలో నడుస్తుంది ఏక్ స్టోరీ ప్రేమ కథ మూవీ. ప్రతి ఊర్లో లాగే ఆ ఊర్లో కూడా సర్పంచ్ ఉంటాడు. అతని కొడుకు పేరు లడ్డు సింగ్. అయితే స్వతంత్ర భావాలు ఉన్న చదువుకున్న అమ్మాయి సభ్యత తో హీరో ప్రేమలో పడతాడు. అలాగే హీరోయిన్ కూడా అతన్ని మనస్పూర్తిగా ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించడంతో ఇద్దరి ఇష్ట ప్రకారమే పెద్దలు కూడా పెళ్లి చేస్తారు. కానీ ఫస్ట్ నైట్ రోజు అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

తొలి రాత్రికి ముందే ఆ ఊళ్ళో జరిగే సంప్రదాయం ప్రకారం సభ్యతకు కోరి ప్రతా అంటే కన్యత పరీక్ష జరగాల్సిందేనని సర్పంచ్ తో సహా పెద్దలంతా పట్టుబడతారు. కానీ హీరోయిన్ ఒక్కతే ఆ పద్ధతికి అడ్డు చెబుతుంది. అంతేకాకుండా ఇది ఒక దురాచారం అంటూ పోరాటానికి రెడీ అవుతుంది. కానీ ఆమెను ఎంతగానో ప్రేమించిన భర్త మాత్రం హీరోయిన్ కు సపోర్ట్ నిలవకుండా దూరమవుతాడు. పైగా ఊళ్ళో ఆచారాలు కట్టుబాట్లు అంటూ ఆమెకు షాక్ ఇస్తాడు. మరి ప్రేమించిన వాడే మూర్ఖుడిగా మారి, తనను ఎందుకు సపోర్ట్ చేయలేదు ? హీరోయిన్ తన పోరాటంలో గెలిచిందా ? అసలు ఇలాంటి పరీక్షను ఎందుకు పెడతారు? చివరికి హీరో హీరోయిన్ ఒకటయ్యారా లేదా? అనే విషయాలు తెలియాలంటే జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఏక్ కోరి ప్రేమ కథ అనే మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు