OTT Movie : ఉద్యోగం కోసం భర్త ముందే హీరోయిన్ డర్టీ గేమ్… ఫ్యూజులు అవుట్ అయ్యే బో*ల్డ్ మూవీ

OTT Movie : ప్రస్తుత తరంలో ఉద్యోగం అనేది ఎంత ముఖ్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైనాన్షియల్ ఫ్రీడం కావాలన్నా, నచ్చినట్టుగా బతకాలి అన్నా లేదా ఒకరిపై ఆధారపడకుండా జీవితాన్ని నెట్టుకు రావాలి అన్నా కూడా ఉద్యోగం ఉండి తీరాల్సిందే. అప్పుడే చేతిలో అవసరానికి సరిపడా పైసలు, మూడు పూటలా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయి. లేదంటే పూట గడవడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఉద్యోగం కారణంగా కాబోయే భార్యాభర్తల మధ్య అహం పెరిగితే ఏం జరుగుతుంది అనే స్టోరీనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో చూద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ బో*ల్డ్ జానర్ కి సంబంధించింది. కాబట్టి ముందుగా ఈ సినిమాను ఒంటరిగా చూస్తే బెటర్ అని గుర్తు పెట్టుకోండి. ఈ హాట్ మూవీ ప్రస్తుతం దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతోంది. సినిమా పేరు ఫెయిర్ ప్లే.

Fair Play' is a thrilling workplace/domestic melodrama for the modern era :  NPR

- Advertisement -

కథ ఏంటంటే…

ఒకే ఆఫీసులో పని చేసే ఇద్దరు కోలీగ్స్ రహస్యంగా ప్రేమించుకుంటారు. ఓకే కంపెనీలో పని చేయడమే కాదు ఒకే ఫ్లాట్ లో ఉంటారు కూడా. కానీ కంపెనీలో మాత్రం తామిద్దరం జస్ట్ కొలీగ్స్ అన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకానొక మంచి సమయం చూసి తమ మధ్య ఉన్న ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోవాలి అని డిసైడ్ అవుతారు. అయితే అంతలోపే సడన్ గా కథను మలుపు తిప్పే ట్విస్ట్ ఎదురావుతుంది. వాళ్ళ ఆఫీస్ లో ఓ మేనేజర్ ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు బాస్. ఆ పోస్టు కోసం కంపెనీలో ఉన్న కొంతమందిలో ఒకరిని సెలెక్ట్ చేయాలని అనుకుంటారు. ఊహించని విధంగా ఆ అవకాశం హీరోయిన్ కి వస్తుంది. అయితే వాళ్ల జీవితంలో అదే అతిపెద్ద మిస్టేక్ అవుతుంది. అప్పటిదాకా సీక్రెట్ గా అయినప్పటికీ ఎంతో సంతోషంగా, చిలకా గోరింకల్లా ముద్దుగా ఉన్న ఆ లవ్ బర్డ్స్ మధ్య విబేధాలు మొదలవుతాయి. ఆ కంపెనీలో కపుల్స్ కి వర్క్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఇద్దరిలో ఎవరో ఒకరు ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే హీరోగానీ, మరోవైపు హీరోయిన్ గానీ ఇద్దరూ తమ ఉద్యోగాన్ని వదులుకోవడానికి అస్సలు రెడీగా ఉండరు. హీరో అయితే ఉద్యోగానికి బదులు రిలేషన్ తెంచుకోవడానికి సిద్ధపడతాడు. మరోవైపు హీరోయిన్ ప్రమోషన్ ను నిలబెట్టుకోవడానికి పై వాళ్ళతో డర్టీ గేమ్స్ స్టార్ట్ చేస్తుంది. మరి ఈ విషయం హీరోకి తెలిసిందా? ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ? వీళ్లిద్దరి వ్యవహారం ఆఫీసులో బయట పడిందా? ఒకవేళ తెలిస్తే ఇద్దరూ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది? చివరికి ఈ లవ్ బర్డ్స్ కలిసారా లేదా ? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఫెయిర్ ప్లే మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు