OTT Movie : కూతురి వర్క్ ప్లేస్ లో తల్లితో యజమాని రొమాన్స్… డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయిన మూవీ

OTT Movie : ఒక మంచి రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ గురించి వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇప్పటిదాకా హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూసి బోర్ గా ఫీల్ అయిన వాళ్లకు ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇప్పటిదాకా ఎన్నో రొమాంటిక్ సినిమాలు ఓటిటిలో అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం ప్రేక్షకులు భాష అనే బారియర్ ను పక్కన పెట్టేసి అన్ని రకాల సినిమాలపై లుక్కేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు వదలకుండా చూస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ జానర్ లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఫ్యామిలీ అఫైర్. రిచర్డ్ లాగ్రావెనీస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా నికోల్ కిడ్ మాన్, జోయ్ కింగ్, జాక్ ఎఫ్రాన్, లిజా కోషి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ప్రముఖ ఓటిటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మే 28 నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది.

A Family Affair (2024) - IMDb

- Advertisement -

థియేటర్లలోకి రావాల్సిన మూవీ ఓటిటిలోకి…

అయితే రొమాంటిక్ అనగానే బోల్డ్ అంశాలను ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కచ్చితంగా నిరాశకు గురవుతారు. మంచి ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళ కోసం మాత్రమే ఈ మూవీ. నిజానికి ఫ్యామిలీ అఫైర్ మూవీని 2023 నవంబర్లో థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అంతలోపే మేకర్స్ కు సహనం నచ్చినట్టు ఉంది. అందుకేనేమో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

ఫ్యామిలీ అఫైర్స్ స్టోరీ ఏంటంటే…

ఓ అమ్మాయి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది వర్క్ ప్లేస్ కి ఫ్యామిలీ మెంబర్స్ వస్తేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఆ యువతి వర్క్ ప్లేస్ లోనే తన తల్లితో ఆ యజమాని ఏకంగా రొమాన్స్ చేస్తాడు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. మరి అసలు విషయం తెలుసాక ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యింది ? ఆ తల్లి ఏం చేసింది ? కూతురి యజమానితో తల్లి రొమాన్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే విషయాలను ఈ మూవీలో చూపించారు. రొమాన్స్ తో పాటు కామెడీ కూడా ఉండే సినిమాను చూడాలి అనుకునేవారు ఈ మూవీని చూశాక కచ్చితంగా వర్త్ వర్మ అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. భాష అడ్డు కాదు అనుకునే వారు ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కెయ్యండి. ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు