OTT Movie : ఆ ఐలాండ్ లో అడుగు పెడితే చావే… భయంతో చెమటలు పట్టించే హారర్ మూవీ

OTT Movie : ఎన్ని సినిమాల జానర్లు ఉన్నా, అందులో హారర్ సినిమాలు వేరయా అంటారు భయపెట్టే సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్. అందుకే హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ మూవీస్ అంటే అందులోను హారర్ ఫాంటసీ, హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్, హారర్ సస్పెన్స్ వంటి సినిమాలు ఉంటాయి. సాధారణంగా సినిమాలు చూసే వారికి ఇందులో ఇన్ని సెపరేట్ కేటగిరీలు ఉంటాయా అనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ హారర్ మూవీ లవర్స్ కి మాత్రం ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే కేటగిరి ఏదైనా హారర్ మూవీ అయితే చెవి కోసుకునే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఈ సినిమా స్టోరీ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఒక ఫాంటసీ హర్రర్ సినిమా. ఈ మూవీ హ్యాపీగా మొదలై ఎండింగ్ మాత్రం హారర్ తో ముగుస్తుంది. ఒక డిఫరెంట్ ప్లాట్ తో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Prime Video: Blumhouse's Fantasy Island

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఒక మిడ్ ఏజ్ ఉన్న వ్యక్తికి ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ వెళ్తూ ఎంజాయ్ చేయడం అంటే పిచ్చి. కానీ తనకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. అయితే ఆ వ్యక్తికి తరచుగా కొంతమందితో కలిసి ఓ ఐలాండ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కలలు వస్తాయి. ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎవరిని పడితే వాళ్లని ట్రిక్ కి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఒక్కరు కూడా అతని రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయరు. హీరో హీరోయిన్ మాత్రం తమ గ్యాంగ్ తో కలిసి అతనితో ట్రిప్ వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వాళ్ళు ఓకే చెప్పడమే ఆలస్యం ఈ వ్యక్తి తనకు కలలో వచ్చే ప్రదేశం గురించి రీసెర్చ్ చేసి మరి అక్కడికే వెళ్దామని ఫిక్స్ చేస్తాడు. మొత్తానికి అంతా కలిసి ఫాంటసీ ఐలాండ్ కు వెళతారు. దానిని డెత్ ఐలాండ్ అని కూడా పిలుచుకుంటారు. అది ఒక స్కల్ రూపంలో ఉంటుంది. మొత్తానికి ఈ గ్యాంగ్ అంతా కలిసి అక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుండగానే ఈ గ్యాంగ్ అంతా కలిసి వెళ్లిన బోట్ కాలి బూడిదవుతుంది. కానీ హీరో టీం ఏమాత్రం టెన్షన్ పడకుండా మరో బోటు కోసం ట్రై చేస్తారు. ఈ నేపథ్యంలోనే వాళ్లకి ఒక బుక్ కనిపిస్తుంది. అందులో ఉన్న రాతలు చూసి ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలవుతుంది. మరి చివరికి ఐలాండ్ కు వెళ్లిన వారు ఎవరైనా తప్పించుకోగలిగారా? అసలు అక్కడికి వెళ్లినవారు ఎందుకు చనిపోతున్నారు? చివరకు స్టోరీ ఎలా ఎండ్ అయింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఫాంటసీ ఐలాండ్ సినిమాపై ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు