OTT Movie : ప్రేమ కోసం తపించే అమ్మాయికి రాక్షసుడు తగిలితే… అమ్మాయిలు మస్ట్ వాచ్

OTT Movie : ప్రేమ, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. అయితే పెళ్లి చేసుకోవడానికంటే ముందే నచ్చివా వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికే ఇప్పటి యూత్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ప్రేమ అనేది లేకపోతే అసలు లైఫే కాదు. అందుకే ప్రేమ కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఇలా ప్రేమ కోసం పరితపిస్తున్న అమ్మాయి జీవితంలోకి ఓ రాక్షసుడు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది ? అనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? సినిమా పేరేంటి ? అనే వివరాల్లోకి వెళితే…

హాట్ స్టార్ లో అందుబాటులో

ప్రేమలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. అయితే ఆ నమ్మకాన్నే ఆయుధంగా వాడుకుని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతగానో కోరుకున్న ప్రేమికుడు దారుణమైన వ్యక్తి అని తెలిస్తే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్. నిజానికి ఈ స్టోరీ లైన్ తో ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం చూశాము కూడా. కానీ ఈ మూవీ స్టోరీ మాత్రం ఫ్రెష్ గా అన్పిస్తుంది. అలాగే ఈ మూవీ పేరు కూడా ఫ్రెష్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎన్నో కలలు కన్న అబ్బాయి ప్రేమికుడు కాకుండా రాక్షసుడు అయితే ఎలా ఉంటుంది అనే ఘోరమైన నిజాన్ని కళ్ళ ముందు ఉంచే మూవీ. బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో చూపి కళ్ళు తెరిపించేలా ఉంటుంది మూవీ. మొత్తానికి సినిమా అంతా కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్ పరంగా ఖచ్చితంగా మూవీ లవర్స్ మెప్పిస్తుంది.

Fresh' Ending Explained: Everything That Went Down in That Tasty Finale

- Advertisement -

కథలోకి వెళ్తే…

అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎలా ట్రై చేస్తారో అబ్బాయిల కోసం అమ్మాయిలు కూడా అలానే వెతుకుతారు. ఈ మూవీలో కూడా అలాగే ఓ అమ్మాయి లవర్ కోసం వెతుకుతుంది. డేటింగ్ యాప్స్ లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని, వారితో కలిసి మాట్లాడుతుంది. కానీ అందులో ఒక్కరూ కూడా నచ్చరు. ఈ క్రమంలోనే సూపర్ మార్కెట్ లో ఓ అబ్బాయి దొరుకుతాడు అంటే కలుస్తాడు. కానీ వాడు బయటకు మాత్రమే మనిషిలా ఉంటాడు. ఆలోచనలన్నీ క్రూరంగా ఉంటాయి. ఇవన్నీ తెలియని ఆ అమ్మాయిని పడేయడానికి ప్లాన్ వేస్తాడు. అనుకోకుండా కలిసినట్టు డ్రామాలు చేస్తాడు. అలాగే హీరోయిన్ తన ఫ్రెండ్ తో మాట్లాడే మాటలను ఫోన్ హ్యాక్ చేసి వింటాడు. ఇక హీరోయిన్ కు నచ్చే విధంగా ఉంటూ ఆమెకు దగ్గరవుతాడు. ప్రేమ కోసం పరితపిస్తున్న ఆ అమ్మాయిని నమ్మించి, తర్వాత డ్రగ్స్ అలవాటు చేసి, నిజ జీవితం ఏదో, ఆమె ఏం చేస్తుందో కూడా తెలియకుండా చేస్తాడు. చివరికి ఆ అమ్మాయి ఈ రాక్షసుడు నుంచి ఎలా తప్పించుకుంది? అతని వలలో పడిన తర్వాత ఎలాంటి నిజాలను తెలుసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు