OTT Movie : చెల్లికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నవాడు భార్యకు ఎక్స్ అని తెలిస్తే… ఆ భర్త పరిస్థితిని ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : టైటిల్ కాస్త బోల్డ్ గానే ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చుని చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. మరి ఈ హిలేరియస్ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

హాట్ స్టార్ లో అందుబాటులో…

ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అద్భుతమైన కంటెంట్ తో మలయాళ దర్శకులు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు చెప్పుకుంటున్న మలయాళ మూవీలో మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సలార్ మూవీతో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఆయనతో పాటు జోసెఫ్ బాసిల్ అనే మరో హీరో కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. నిఖిల విమల్, అనశ్వర రాజన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సూపర్ హిట్ మాలీవుడ్ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు గురువాయూర్ అంబలనాడయిల్. ఈ మూవీ మే 16న థియేటర్లలోకి రాగా, 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దాదాపు 90 కోట్లు వసూలు చేసింది. జూన్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Guruvayoor Ambalanadayil Box Office Collection Day 4 | Guruvayoor  Ambalanadayil Today Box Office Collection | Guruvayoor Ambalanadayil Sunday  Box Office Collection | Guruvayoor Ambalanadayil Day 4 Box Office  Collection Kerala, India & Worldwide - Filmibeat

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఆనంద్, పార్వతీ భార్య భర్తలు. అయితే ఓ ఆకాశ రామన్న రాసిన లేఖ వల్ల భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందనే అనుమానంతో ఆనంద్ ఆమెను వదిలేస్తాడు. మరోవైపు విను అని పిలుచుకునే వినయ్ రామచంద్రన్ ఎక్స్ లవర్ పేరు కూడా పార్వతే. అయితే ఆనంద్ మోటివేషన్ తో వినయ్ ఎక్స్ లవర్ ని మర్చిపోయి, ఆయన చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో ఆనంద్, విను మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే పెళ్లి జరగాల్సిన క్రమంలో ఆనంద్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు అని తెలుసుకున్న విను అసలేం జరిగిందో తెలుసుకుని ఆ భార్య భర్తలు ఇద్దరినీ కలుపుతాడు కూడా.

దుబాయ్ లో ఉద్యోగం చేసే విను పెళ్లి కోసం సొంత ఊరైన కేరళకు వచ్చేస్తాడు. అయితే ఆనంద్ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య తన ఎక్స్ లవర్ అని తెలుసుకొని వినుకి దిమ్మతిరుగుతుంది. ఆ తర్వాత ఆనంద్ కి కూడా విను మాజీ ప్రియురాలు, తన భార్య ఒక్కరే అని తెలుస్తుంది. మరి ఈ పరిస్థితిని వీరిద్దరూ ఎలా హ్యాండిల్ చేశారు ? అనే ఈ హిలేరియస్ కామెడీ రోలర్ కోస్టర్ లాంటి మూవీని తెరపై చూసి తీరాల్సిందే. ఇప్పటిదాకా ఎవరైనా ఈ మూవీని ఇంకా చూడకపోతే అస్సలు ఆలోచించకండి. మీతో వర్త్ వర్మ అనిపించేలా ఉంటుంది మూవీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు