OTT Movie : ఓటిటిని ఊపేస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్… ఏ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : ప్రస్తుతం ఓటిటిలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకూ ఇలాంటి సినిమాలను చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ఓటిటిలో ఈ క్రైం థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇలా రిలీజ్ అవుతాయో లేదో అలా ట్రెండింగ్లోకి వచ్చేస్తాయి అంటేనే ఈ సినిమాలకు ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ ఈ జానర్ కు సంబంధించినదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మూవీ గురించి కాదు వెబ్ సిరీస్ గురించి. ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్  తో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రేక్షకులు క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఎంతగా అలవాటు పడ్డారు అనే విషయాన్ని ఈ మూవీ మరోమారు ప్రూవ్ చేసింది. ప్రస్తుతం జీ5 లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసిందంటూ స్వయంగా సదరు సిరీస్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అధికారికంగా అనౌన్స్ చేసింది. పైగా ఈ సిరీస్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. మరి ఓటిటి మూవీ లవర్స్ ను ఇంతగా మెప్పించిన ఈ డిఫరెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను మీరు ఇంకా చూడలేదా? అయితే వెంటనే ఓ లుక్కెయ్యండి.

Gyaarah Gyaarah Review Starring Raghav Juyal, Kritika Kamra Streaming On Zee5

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఈ వెబ్ సిరీస్ నిజానికి రెండు జానర్లకు సంబంధించిన సిరీస్ అని చెప్పొచ్చు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో పాటు టైం ట్రావెల్ మూవీ కూడా. రెండు జానర్లను అలా ఎలా మిక్స్ చేశారు అంటే స్టోరీ లోకి వెళ్తే అర్థమయిపోతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 1990లో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన భవిష్యత్ పోలీస్ కు కాల్ చేస్తాడు. అంటే అతను ఆ కాలం నుంచి ప్రజెంట్ లో ఉండే మరో పోలీస్ ఆఫీసర్ ను వాకి టాకీ ద్వారా మాట్లాడుతాడు. అది కూడా సరిగ్గా అర్ధరాత్రి 11.11 గంటల టైంలో కేవలం 60 సెకండ్లు మాత్రమే. ఆ సెకండ్ల వ్యవధిలోనే వీరిద్దరి మధ్య సంభాషణ నడుస్తుంది. కానీ నిజానికి వీరిద్దరూ వేర్వేరు కాలాల్లో ఉంటారు. ఆ విషయం ఇద్దరికీ తెలియదు. మరి దేనికోసం వీరిద్దరి మధ్య ఆ సంభాషణ నడిచింది? ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు తాము టైం ట్రావెల్ చేశామని ఎప్పుడు ఎలా తెలుస్తుంది? ఇద్దరు కలిసి వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చగలిగారా? అసలు వీళ్ళు ఆపాలి అనుకున్న క్రైమ్ ఏంటి? అనే విషయం తెలియాలంటే ప్రస్తుతం జీ ఫైవ్ లో అందుబాటులో ఉన్న గ్యారా గ్యారా అనే వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఓటీటీని భారీ వ్యూస్ తో ఊపేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు