OTT Movie : ఆ హాస్పిటల్ లోకి వెళ్తే తిరిగి రారు… ఫ్యూజులు అవుట్ అయ్యే కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : గతంలో టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఎన్నో సీరియల్స్ సంవత్సరాల తరబడి నడిచి చరిత్రను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పట్లో సీరియల్స్ టైమ్ అయ్యిందంటే చాలు పనులన్నీ వదిలేసుకుని మరీ టీవీలకు అతుక్కుపోయే వారు చాలామంది మహిళలు. కానీ ఇప్పుడు తరం మారింది. అలాగే డిజిటల్ యుగం కూడా వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అరచేతిలోనే ఎన్నో వింతలను చూడగలుగుతున్నాము. మరోవైపు ఓటీటీల వల్ల ప్రపంచంలోని ఏ భాషలోని సినిమానైనా సబ్ టైటిల్స్ తో చూసి అర్థం చేసుకోగలుగుతున్నాము. అలా ఓటీటీ మూవీ లవర్స్ చూడడానికి ఇష్టపడే కేటగిరీలో కొరియన్ డ్రామాలు ముందు వరుసలో ఉంటాయి. ఇక అప్పట్లో సీరియల్స్ ఎలాగో ఇప్పుడు వెబ్ సిరీస్ లు అలా. ఈరోజు మన మూవీ సజెషన్ లో అలాంటి ఓ మంచి కొరియన్ డ్రామా గురించి తెలుసుకోబోతున్నాము. ఆ సిరీస్ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక పీరియాడికల్, సైంటిఫిక్ యాక్షన్ డ్రామా ఉన్న కొరియన్ వెబ్ సిరీస్ గురించి. దీనికి ఐఎండీబీలో 7.8/10 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఇంకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి. ఇందులో మొత్తంగా 10 ఎపిసోడ్స్ ఉండగా, ఒక్కో ఎపిసోడ్ కనీసం 70 నిమిషలైనా ఉంటుంది. ఒక్కసారి ఈ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అన్పించే విధంగా ఉంటుంది ఈ సిరీస్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సిరీస్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Watch Gyeongseong Creature | Netflix Official Site

- Advertisement -

స్టోరీ ఏంటంటే?

1945లో కొరియాని జపాన్ పాలిస్తున్న రోజుల్లో జరిగిన సంఘటనల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. గ్యాంగ్సన్ అనే ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక ఆస్పత్రి ఉంటుంది. ప్రతీ ఊళ్ళోనూ ఆసుపత్రులు ఉండడం మామూలే. కానీ ఈ ఊళ్ళో ఉన్న ఆ హాస్పిటల్ లోకి రోగులు వెళ్తే తిరిగి బయటకు రావడం జరగదు. కనీసం లోపలకు వెళ్ళిన వారు ఏమయ్యారు అనేది కూడా ఎవరికి అంతుపట్టదు. ఈ విచిత్రమైన హాస్పిటల్ లోకి హీరో హీరోయిన్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడకు వెళ్లిన తర్వాత ఫ్యూజులు అవుట్ అయ్యే సీక్రెట్ రివీల్ అవుతుంది. ఆ దెబ్బతో హీరో హీరోయిన్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయట పడడానికి ట్రై చేస్తారు. మరి ఆ హాస్పిటల్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే జియోంగ్ సియోంగ్ క్రీచర్ (Gyeongseong Creature) అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. సిరీస్ అంతా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. కానీ అక్కడక్కడా హారర్ సీన్స్ ఉంటాయి. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఈ మూవీ మంచి ట్రీట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు