OTT Movie : చదువును పక్కన పెట్టి అమ్మాయికి రొమాంటిక్ పాఠాలు నేర్పే టీచర్… భార్యకు తెలిసి…

OTT Movie : చక్కగా పిల్లలకు పాఠాలు నేర్పించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువు కీచక టీచర్ గా మారి వారితోనే ప్రేమ పాఠాలు వల్లె వేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మనం ఎన్నో వార్తల్లో విన్నాము చూసాము. కానీ అన్నింటి కంటే ఎక్కువగా పరువు ముఖ్యమని భావించే గురువు ఇలాంటి పని చేసి భార్యకి దొరికిపోతే ఏం జరుగుతుంది ? అనేది ఈరోజు మూవీ సజెషన్ లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ టైటిల్ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ స్టోరీ లైన్ వింటేనే ఆ కీచక టీచర్ కాళ్లు విరగొట్టాలి అన్నంత కోపంగా అనిపిస్తుంది. ఇక ఆ పాత్రను వెండితెరపై విలన్ పాత్రలకు ప్రాణం పోసే ఓ అద్భుతమైన నటుడు నటిస్తే వచ్చే కోపం నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. పాన్ ఇండియా లెవెల్లో ఉన్న విలక్షణ నటుల్లో ఆయన పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఈయన తాజాగా ఓ కీచక టీచర్ పాత్రలో నటించి అద్దరగొట్టాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు హరామ్ ఖోర్. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Haraamkhor Movie Review: Or, Aargh! Move Hindi Indie, Move! – mad about  moviez.in

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. ఒక మారుమూల పల్లెటూర్లో ఉండే చిన్న స్కూల్ లో మంచి టీచర్ అని అందరి చేత అనిపించుకుంటాడు. ఇక ఆయనకి అప్పటికే పెళ్లయి, ఒక కొడుకు కూడా ఉంటాడు. కానీ అతని బుద్దే వంకరగా ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన స్కూల్లో ఓ అమ్మాయికి ప్రేమ పాటలు నేర్పిస్తూ ఉంటాడు. ప్రపంచమే తెలియని ఆ అమ్మాయి అతి చిన్న వయసులో అతనితో ప్రేమ మైఖంలో పడిపోతుంది. టీచర్ తోనే భవిష్యత్తు అనుకుని అతని కోసం కుటుంబాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కూడా. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉంటాయి.

ఇక ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి తండ్రి పోలీస్. కానీ అతనికి ఈ విషయాలు ఏమీ తెలియదు. మరోవైపు టీచర్ తన భార్యను మోసం చేస్తూ ఉండగా, ఒకానొక సమయంలో ఆమెకు అసలు విషయం తెలిసిపోతుంది. ఇంకేముంది టీచర్ దుమ్ము దులిపి పుట్టింటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. కానీ అలా చేస్తే ఊరిలో అసలు విషయం తెలిసి పరువు పోతుంది కదా.. దీంతో తన పరువును పేరును ఎలాగైనా కాపాడుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అనుకున్నట్టుగా తన పరువు పోకుండా కాపాడుకున్నాడా? భర్త ఆగడాలను ఆ భార్య బయట పెట్టిందా? చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్ వేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు