OTT Movie : రాత్రికి నీ భార్యతో గడుపుతానంటూ భర్తతో డీల్.. ఇదెక్కడి మెంటల్ బో*ల్డ్ మూవీరా మావా !?

OTT Movie : 9 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన బో*ల్డ్ మూవీ విడుదలైంది. దీని క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే సినిమా మొదట్లో విలన్‌గా అనుకున్న వ్యక్తి క్లైమాక్స్ లో హీరోగా మారడం. అయితే టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సింగిల్ గా చూడడం బెటర్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్

2015 సంవత్సరంలో ఒక సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రం చాలా చర్చనీయాంశమైంది. అందులో ఉన్న ఉత్కంఠభరితమైన సీన్లు, సస్పెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా OTTలో హల్ చల్ చేస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘హేట్ స్టోరీ 3’. హిందీ చిత్రం ‘హేట్ స్టోరీ 3’కి విశాల్ పాండ్యా దర్శకత్వం వహించారు. ‘హేట్ స్టోరీ 3’ డిసెంబర్ 2015 నెలలో థియేటర్లలో విడుదలైంది. శర్మన్ జోషి, కరణ్ సింగ్ గ్రోవర్, జరీన్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అంతేకాకుండాప్రియాంషు ఛటర్జీ, డైసీ షా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. సమాచారం ప్రకారం ‘హేట్ స్టోరీ 3’ నిర్మించడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 62.12 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. రిలీజై దాదాపు 9 సంవత్సరాలు అయ్యాక ఈ సినిమా OTTలో అందుబాటులోకి వచ్చింది. మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడటం కష్టమే. ఎందుకంటే ఇందులో చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి.

,

- Advertisement -

స్టోరీ ఏంటంటే?

సినిమా కథ మొత్తం కేవలం 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఆదిత్య దేవాన్ (శర్మాన్ జోషి) తన భార్య సియా దివాన్‌తో కలిసి జీవించే ప్రముఖ వ్యాపారవేత్త. మరో వ్యాపారవేత్త సౌరవ్ సింఘానియా (కరణ్ సింగ్ గ్రోవర్) కథలోకి ప్రవేశించినప్పుడు ఇద్దరూ తమ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సౌరవ్ ఆదిత్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి అతని భార్యతో కలిసి డిన్నర్‌కి ఆహ్వానిస్తాడు. దీంతో సియా, ఆదిత్య భోజనానికి సౌరవ్ ఇంటికి వెళతారు. తినడం, తాగడం పూర్తయ్యాక సౌరవ్ ఆదిత్య ముందు ఊహించని ఒక షాకింగ్ డీల్ ను ఉంచుతాడు. అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, కానీ అతని భార్య సియా తనతో ఒక రాత్రి గడపాలని షరతు పెడతాడు సౌరవ్. ఈ విషయం జరిగాక ఆదిత్యకు కోపం వస్తుంది. ఆ తర్వాత సౌరవ్ సింఘానియా ఆదిత్య దివాన్‌ను నాశనం చేయడం మొదలు పెడతాడు. అన్ని కుట్రలు పన్ని సౌరవ్ తనతో ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆదిత్యకి అర్థం కాదు. సినిమా చివర్లో దిమ్మతిరిగేలా అసలు ట్విస్ట్ రివీల్ చేయడం చాలా బాగుంది. సినిమా క్లైమాక్స్ పవర్ ఫుల్ గా ఉంటుంది. మరి సౌరవ్ డీల్ కు ఎట్టకేలకు ఆదిత్య ఒప్పుకున్నాడా ? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు